Sreeleela : సినిమాకు గుడ్ బై చెప్పిన శ్రీలీల.. కారణం ఇదే

- Advertisement -


Sreeleela : ప్రస్తుతం టాలీవుడ్ క్రష్ శ్రీలీల అంటే తెలియని వారుండరు. వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలో శ్రీలీలకు వచ్చినంత పాపులారిటీ మరే సెలబ్రిటీకి రాలేదంటే అతిశయోక్తి కాదు. తన టాలెంట్ కు ఆఫర్లు క్యూ కడుతుండటంతో తన కెరీర్ పీక్ స్టేజీలో ఉంది. వరుసగా రెండు హిట్స్ పడగానే అమ్మడి టాలెంట్ చూసిన దర్శకనిర్మాతలు ముద్దుగుమ్మ కోసం క్యూ కట్టారు. ప్రస్తుతం రెండు మూడు సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. కెరీర్ పీక్ స్టేజీలో ఉండగానే శ్రీలీల ఓ షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. శ్రీలీలా సినిమాలకు గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది.

Sreeleela

పెళ్లి సందడి సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది శ్రీలీల. తర్వాత రవితేజ ‘ధమాకా’తో కెరీర్ ఫస్ట్ బ్లాక్ బస్టర్ అందుకుంది. తర్వాత కొన్ని సినిమాల్లో నటించిన అవి ఫ్లాపులుగా మిగిలాయి. ఇటీవల బాలయ్యతో భగవంత్ కేసరి, మహేశ్ తో గుంటూరు కారం సినిమాలలో నటించి బ్లాక్ బాస్టర్ హిట్ లను అందుకున్న విషయం తెలిసిందే. శ్రీలీలాకు అతి తక్కువ సమయంలో బాలయ్య, మహేశ్, పవన్ కళ్యాణ్, ఎనర్జిటిక్ స్టార్ రామ్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించే ఛాన్స్ రావడం విశేషం.

ఒకవైపు చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న శ్రీలీల సోషల్ మీడియాలోనూ యాక్టివ్ ఉంటుంది. తన ఫ్యాన్స్ ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇంత బిజీ షెడ్యూల్ లో ఉన్న అమ్మడు సినిమాలకు గుడ్ బై చెప్పనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తాను డాక్టర్ చదువుతూ ఉంది. కెరీర్, చదువు రెండూ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. ఇక శ్రీలీల తల్లి కూడా డాక్టర్ కావడం విశేషం. అయితే పరీక్షల కోసమే శ్రీలీల కొత్త సినిమాలకు సైన్ చేయట్లేదని తెలుస్తోంది. శ్రీలీల చేతిలో పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా మాత్రమే ఉంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here