Sreeleela : బాగా తెలివి మీరిన శ్రీలీల.. ఇలా అయితే పది ఏంటి.. మరో పది సినిమాల్లో ఛాన్స్ కొట్టేస్తుందిగా..

- Advertisement -

Sreeleela : బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భగవంత్ కేసరి’.. ఈ చిత్రాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి ఎంతో గ్రాండ్ గా తెరకెక్కించారు. ఈ సినిమాలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. అలాగే శ్రీలీల బాలయ్య కూతురి పాత్రలో నటించింది. ఇదిలా ఉంటే ఈ సినిమా ట్రైలర్ గ్రాండ్ లాంచ్ ఈవెంట్ వరంగల్ గడ్డపై ఎంతో భారీగా జరిగింది. శ్రీలీలా ట్రెడిషనల్ లుక్ లో హాజరై ఎమోషనల్ స్పీచ్ తో ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా వేదికపై శ్రీలీలా మాట్లాడుతూ..

sreeleela
sreeleela

‘ఈ సినిమాలో నేను వరంగల్ పిల్లగా నటించాను. బ్యూటీఫుల్ స్టోరీలో విజ్జి పాపగా నటించాను. అలాగే ఇక్కడికి వచ్చాను. ఇంతంటి సోల్ కనెక్ట్ క్యారెక్టర్ ను అనిల్ రావిపూడి గారు నాకిచ్చారు. ఆయనకు బిగ్ థ్యాంక్యూ. నేను చాలా స్టోరీస్ పై సినిమాలు చేస్తున్నాను. కానీ ఈ పాత్ర నాకు ఎంతగానో కనెక్ట్ అయ్యింది. ఈ సినిమా ను డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు చాలా బ్యూటీఫుల్ గా తీశారు.ఇక బాలకృష్ణగారితో నాకు ఎమోషనల్ టైమ్ ఉంది. ఆయనతో కలిసి పనిచేయడం ఎంతో అద్భుతం. ఈ చిత్రంలోని కొన్ని సీన్లు చేసేప్పుడు కట్ చెప్పినా కూడా అదే మూడ్ లో కంటిన్యూ అయ్యాను.

Sreeleela  Saree Photos

ఆ సీన్ నుంచి వెంటనే బయటకి రాలేకపోయాను. అలాంటి సందర్భాల్లో నన్ను నవ్వించి నార్మల్ స్టేజీకి తీసుకొచ్చేవారు. నాకు ఎంతో సపోర్ట్ చేశారు.ఈ చిత్రంలో చాలా బ్యూటీఫుల్ సీన్లు ఉన్నాయి. సర్ ప్రైజ్ ఎలిమెంట్స్ కూడా గుర్తుండిపోతాయి. ఇక బాలయ్య గారు నా లైఫ్ లో లేని అనుభవాలను ఈ సినిమా ద్వారా నాకు అందించారు. ఇది మీ మంచి మనస్సు అంటూ భావోద్వేగమైంది. తన క్యూట్ స్పీచ్ తో బాలయ్యను బాగా పొగిడేసింది.. అలాగే టెక్నిషీయన్లు కూడా అద్భుతంగా వర్క్ చేశారని తెలిపింది. ప్రతి ఒక్కరూ సినిమాను ఎంజాయ్ చేస్తూ చేశారంటూ’ ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ స్పీచ్ కు అందరూ ఫిదా అవుతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here