Sreeleela : ప్రస్తుతం టాలీవుడ్ కి శ్రీలీల ఫీవర్ పట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఈమె ఒక్క రోజు షూటింగ్ కి రాకపోతే కనీసం 5 నుండి 6 సినిమాల షూటింగ్స్ ఆగిపోతాయి. నిర్మాతలకు కోట్ల రూపాయిల నష్టం వాటిల్లుతుంది. ఎందుకంటే ఆమె అన్ని సినిమాలు చేస్తుంది కాబట్టి. వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ పలకరిస్తున్నా కూడా శ్రీలీల కి ఉన్న క్రేజ్ కారణంగా అవకాశాలు తలుపు తడుస్తూనే ఉన్నాయి.

ఒక తెలుగు అమ్మాయి చుట్టూ ఇండస్ట్రీ మొత్తం తిరగడం చూసి చాలా కాలమే అయ్యింది. అయితే శ్రీలీల డ్యాన్స్ ఒక్కటే వెయ్యగలదని, ఆమెకి అసలు యాక్టింగ్ రాదంటూ సోషల్ మీడియా లో కొన్ని కామెంట్స్ కనిపిస్తూ ఉంటాయి. రీసెంట్ గా విడుదలైన ‘గుంటూరు కారం’ చిత్రం తో బోలెడంత నెగటివిటీ ని మూటగట్టుకుంది. ఇందులో డైరెక్టర్ త్రివిక్రమ్ ఆమెని కేవలం డ్యాన్స్ కోసమే వాడుకున్నాడు.

ఇదంతా పక్కన పెడితే ప్రముఖ నిర్మాణ సంస్థ ‘పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ’ రీసెంట్ గానే ‘ఒరిజినల్’ అనే టాక్ షో ని ప్రారంభించింది. ఈ టాక్ షో కి సౌమ్య అనే అమ్మాయి యాంకర్ గా వ్యవహరిస్తోంది. ఈ షో కి అతిథిగా వచ్చిన శ్రీలీల ని సౌమ్య కొన్ని ప్రశ్నలు అడుగుతుంది.

మీకు బుర్ర ఉన్న అబ్బాయి కావాలా?, లేకపోతే ఫన్నీ, జోవియల్ గా ఉండే అబ్బాయి కావాలా? అని అడగగా శ్రీలీల దానికి సమాధానం చెప్తూ ‘ఫన్నీ, జోవియల్ గా అనే అబ్బాయి మాత్రమే కావాలి, బుర్రతో చెయ్యాల్సిన పనులను నేను చూసుకుంటా’ అంటూ బదులిచ్చింది. దీనికి అర్థం ఏమిటంటే నాకు బుర్ర లేని అబ్బాయి కావాలి అని శ్రీలీల అడుగుతుంది అంటూ చెప్పుకొస్తున్నారు నెటిజెన్స్. ఇకపోతే శ్రీలీల చేతిలో ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తో పాటుగా పలు సినిమాలు ఉన్నాయి. ఇవి పూర్తి చేసిన తర్వాత కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చి మెడికల్ పరీక్షలకు సిద్ధం కాబోతుంది ఈ హాట్ బ్యూటీ.
