Sreeleela : పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్న శ్రీలీల.. తను ప్రేమించే వ్యక్తి ఎవరో తెలుసా.. అబ్బా ఏమున్నాడ్రా బాబు

- Advertisement -


Sreeleela : టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల గురించి ప్రస్తుతం ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అచ్చ తెలుగుమ్మాయి అయినప్పటికీ వీళ్ల ఫ్యామిలీ కర్ణాటకలో సెటిలైంది. శ్రీ లీల ముందుగా కన్నడ సినీ పరిశ్రమ ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా తెరకెక్కిన పెళ్లి సందD అనే సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయింది. మొదటి సినిమానే సూపర్ హిట్ కావడం.. అందులో శ్రీలీల చలాకీ నటనకు ప్రేక్షకులు ముగ్ధులైపోయారు. దాంతో అమ్మడికి వెంటనే రవితేజ సరసన ధమాకా ఆఫర్ వచ్చింది. అదీ బ్లాక్ బస్టర్ కావడంతో అమ్మడికి గోల్డెన్ లెగ్ ముద్ర పడిపోయింది. దీంతో అమ్మడే తమ సినిమాల్లో హీరోయిన్ గా కావాలంటూ చిన్న హీరోల నుంచి బడా హీరోల వరకు తన వెంటే పడుతున్నారు. తను ఇటీవలే బాలయ్య బాబు కూతురుగా భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అది హిట్ కావడంతో ఆమె లెగ్ పడితే అది హిట్లే అన్న నమ్మకం నిర్మాతల్లో బలంగా నాటుకుపోయింది.

అఫీషియల్ గా, అనఫీషియల్ గా మొత్తంగా చూసుకుంటే దాదాపు ఒక డజన్ సినిమాలు శ్రీలీల ఖాతాలో ఉన్నాయి. కొన్ని సినిమాలను కాల్షీట్లు సర్దుబాటు చేయలేక వదిలేసుకుంటుంది. ఫ్యాన్స్ ని ఆకట్టుకునే క్రమంలో ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో శ్రీలీల చాలా యాక్టివ్ అయింది. ఈ నేపథ్యంలోనే ఇన్ స్టాగ్రామ్లో చాట్ సెషన్ నిర్వహించింది. అందులో అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చింది. అందులో భాగంగా బిగ్ బాస్ కి ఈ రోజు వస్తున్నారంటే.. అవును ఆది కేశవ ప్రమోషన్స్ కోసం వస్తున్నానని చెప్పుకొచ్చింది. ఇంతలోనే ఒక అభిమాని మీరు కమిటెడ్ ఆ అని డైరెక్టుగా క్వశ్చన్ వేశారు. అంటే మీరు ఎవరితోనైనా ప్రేమలో ఉన్నారా అని నెటిజన్ అడిగిన ప్రశ్నకు తెలివిగా ఆన్సర్ ఇచ్చింది. అవును, నేను కమిటెడే కానీ, అది నా పనికి అంటూ చెప్పుకొచ్చింది.. శ్రీలీల. దీంతో బ్యూటీ విత్ బ్రెయిన్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here