Sreeleela : కేవలం రెండు మూడు సినిమాలతోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయిన నటి శ్రీలీల. గడిచిన రెండు మూడు సంవత్సరాలలో ఎంతో మంది కుర్ర హీరోయిన్లు ఇండస్ట్రీ లోకి వచ్చారు. ఒకటి రెండు హిట్టు సినిమాల్లో నటించి మంచి క్రేజ్ ని సంపాదించుకున్నారు కానీ, ఆ క్రేజ్ ని ఎక్కువ కాలం కొనసాగించలేకపోయారు. కానీ శ్రీలీల మాత్రం హిట్ మరియు ఫ్లాప్ తో సంబంధం లేకుండా ఇండస్ట్రీ లో దూసుకుపోతుంది.

ధమాకా చిత్రం తర్వాత ఈమె నుండి నాలుగు సినిమాలు విడుదల అయ్యాయి. అందులో మూడు చిత్రాలు డిజాస్టర్ ఫ్లాప్స్ కాగా, కేవలం ‘భగవంత్ కేసరి’ చిత్రం మాత్రమే హిట్ అయ్యింది. రీసెంట్ గా విడుదలైన ‘ఎక్స్ ట్రా ఆర్డినరీ మెన్’ చిత్రం కూడా ఆమె కెరీర్ లో పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలింది. ఇక వచ్చే నెలలో విడుదల అవ్వబోతున్న ‘గుంటూరు కారం’ చిత్రం మీదనే ఆమె ఆశలన్నీ పెట్టుకుంది.

ఈ సినిమా నుండి ‘ఓ మై బేబీ’ అనే పాటకి సంబంధించిన ప్రోమో ని విడుదల చేసారు. ఈ ప్రోమో లో శ్రీలీల చాలా క్యూట్ గా కనిపించింది. కొన్ని చీరాలలో ఆమెని చూస్తే ప్రముఖ స్టార్ హీరోయిన్ ఆర్తి అగర్వాల్ గుర్తుకు వచ్చింది. ఆ ప్రోమో లోని శ్రీలీల ఫోటోలను కొన్ని సోషల్ మీడియా లో ఆర్తి అగర్వాల్ తో పోల్చి చూస్తూ అచ్చం ఆమె లాగానే ఉంది కదూ?, ఇద్దరు అక్కా చెల్లెల్లు అంటే ఎవరైనా నమ్మేస్తారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కొంతమంది అయితే శ్రీలీల ని ట్యాగ్ చేసి ఆర్తి అగర్వాల్ మీకు చుట్టాలు అవుతారా అని అడుగుతున్నారు. నిజంగా ఆ ఫోటోలను చూస్తే అలాగే అనిపిస్తుంది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రస్తుతం శ్రీలీల చేతిలో గుంటూరు కారం తో పాటుగా, ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఉంది. ఈ రెండు చిత్రాల్లో ఏది హిట్ అయినా శ్రీలీల రేంజ్ ఎవ్వరూ ఊహించని స్థాయికి వెళ్తుందని అంటున్నారు విశ్లేషకులు.