Sreeleela : ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి చేరుకున్న నటి శ్రీలీల. పెళ్ళిసందడి సినిమాతో యావరేజి ఫలితం ని దక్కించుకున్నప్పటికీ, రెండవ సినిమా ‘ధమాకా’ తో భారీ బ్లాక్ బస్టర్ ని అందుకుంది. ఈ సినిమా ఫలితం ఆమె జాతకంనే మార్చేసింది. కేవలం ఆమె డ్యాన్స్ వల్లనే సూపర్ హిట్ అయ్యింది అని బలంగా నమ్మబట్టే హీరోలు, దర్శక నిర్మాతలు వరుసగా ఆమెతో సినిమాలు చెయ్యడానికి ముందుకు వచ్చారు.
కానీ ‘ధమాకా’ తర్వాత ఆమె చేసిన సినిమాలన్నీ వరుసగా డిజాస్టర్ ఫ్లాప్ అవుతూ వచ్చింది. మధ్యలో ‘భగవంత్ కేసరి’ చిత్రం యావరేజి గా ఆడినప్పటికీ కమర్షియల్ గా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోలేకపోయింది. ఇక రీసెంట్ గా విడుదలైన ‘గుంటూరు కారం’ చిత్రం ఏ రేంజ్ డిజాస్టర్ ఫ్లాప్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటించగా, శ్రీలీల మెయిన్ హీరోయిన్ గా నటించింది.
ఇప్పుడు శ్రీలీల అవకాశాలను గండి కొట్టే రేంజ్ కి వచ్చేసింది మీనాక్షి చౌదరి. వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ ఉన్న శ్రీలీల తో సినిమాలు చెయ్యడానికి ఇప్పుడు ఏ దర్శక నిర్మాత కూడా ఆసక్తి చూపించడం లేదు. అందుకే ఇప్పుడు అందరు మీనాక్షి చౌదరి డేట్స్ కోసం క్యూలు కడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇది ఇలా ఉండగా గతం లో విజయ్ దేవరకొండ, శ్రీలీల హీరోహీరోయిన్లు గా జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తో ఒక కొత్త సినిమా మొదలైంది.
ఈ సినిమా నుండి మేకర్స్ శ్రీలీల ని తప్పించి మీనాక్షి చౌదరి ని తీసుకుంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీలీల ఒప్పుకున్నా మిగిలిన సినిమాలు కూడా త్వరలో ఆమెని మీనాక్షి చౌదరి రీప్లేస్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అలా నిన్న మొన్నటి వరకు దూకుడు మీద దూసుకెళ్లిన శ్రీలీల కి రీసెంట్ ఫ్లాప్స్ స్పీడ్ బ్రేకర్స్ గా మారిపోయాయి.