Sreeleela : అవకాశాలు లేక చివరికి అలాంటి వీడియోలు చెయ్యడానికి సిద్దమైన శ్రీలీల.. ఫ్యాన్స్ కి ఇది ఊహించని షాక్!

- Advertisement -

Sreeleela : టాలీవుడ్ లోకి రీసెంట్ గ అవచిన కొంతమంది హీరోయిన్లు కేవలం ఒకటి రెండు సినిమాలతోనే స్టార్ హీరోయిన్ రేంజ్ ఇమేజిని సంపాదించుకొని ఎవ్వరూ ఊహించని రేంజ్ కి వెళ్తున్నారు. మళ్ళీ అదే హీరోయిన్లు సరైన స్క్రిప్ట్ సెలక్షన్ లేక వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ ని అందుకొని కనుమరుగు అయిపోతున్నారు. ‘ఉప్పెన’ ఫేమ్ కృతి శెట్టి పరిస్థితి ఇలాగే అయ్యింది. ఇప్పుడు మరో యంగ్ హాట్ బ్యూటీ శ్రీలీల పరిస్థితి కూడా అలాగే మారనుందా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. నిన్న మొన్నటి వరకు యంగ్ హీరోస్ దగ్గర నుండి స్టార్ హీరోస్ వరకు ప్రతీ ఒక్కరు శ్రీలీల డేట్స్ కోసం క్యూలు కట్టేవారు. చాలా కాలం తర్వాత ఒక తెలుగు అమ్మాయి స్టార్ హీరోయిన్ అయ్యింది అని ఎంతోమంది సంతోషించారు. కానీ సరైన స్క్రిప్ట్స్ ఎంచుకోవడం లో ఈమె విఫలం అయ్యింది.

Sreeleela
Sreeleela

‘పెళ్లి సందడి’ చిత్రం తర్వాత ఈమె డజను సినిమాలు చేస్తే అందులో కేవలం ‘ధమాకా’, ‘భగవంత్ కేసరి’ చిత్రాలు మాత్రమే సక్సెస్ అయ్యాయి. మిగిలిన సినిమాలన్నీ ఒక దానిని మించి ఒకటి డిజాస్టర్ ఫ్లాప్ అవుతూ వచ్చాయి. ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతి కానుకగా విడుదలైన సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గుంటూరు కారం’ చిత్రం లో శ్రీలీల హీరోయిన్ గా నటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం కూడా ఎంతపెద్ద డిజాస్టర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమా తర్వాత శ్రీలీల మరో తెలుగు సినిమాలో కనిపించలేదు. ప్రస్తుతం ఆమె చేతిలో నితిన్ తో చేస్తున్న ‘రాబిన్ హుడ్’, పవన్ కళ్యాణ్ తో చేస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాలు మాత్రమే ఉన్నాయి.

Sreeleela walks out of star hero's next, deets inside | Latest Telugu cinema news | Movie reviews | OTT Updates, OTT

- Advertisement -

విజయ్ దేవరకొండ – గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో ముందుగా శ్రీలీల ని ఒక హీరోయిన్ గా తీసుకున్నారు కానీ, ఆ తర్వాత ఆమెని తప్పించి ‘మిస్టర్ బచ్చన్’ ఫేమ్ భాగ్యశ్రీ భోర్సే ని తీసుకున్నారు. అలా చేతిలో ఉన్న ప్రాజెక్ట్ చేజారిపోయింది, ప్రస్తుతం ఆమె చేతిలో రెండు సినిమాలు తప్ప ఇంకేమి లేవు. దీంతో ఆమె కేవలం యాడ్స్ కి, షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ కి మాత్రమే పరిమితమైంది. రీసెంట్ గా ఆమె శాస్త్రి బామ్ కి యాడ్స్ చేసింది. ఇప్పటికే ఒక యాడ్ ని ప్రతీ రోజు మనం టీవీ లో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు సరికొత్త యాడ్ వచ్చింది. ఈ యాడ్ వీడియో ని ఆమె స్వయంగా తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది.

 

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here