Sreeleela : ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన హీరోయిన్ శ్రీలీల. శ్రీకాంత్ కొడుకు హీరోగా నటించిన ‘పెళ్లి సందడి’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైనా ఈ అచ్చతెలుగు అమ్మాయి అతి తక్కువ సమయం లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోతుందని మాత్రం ఎవ్వరూ ఊహించలేకపోయారు.గత కొన్ని దశాబ్దాల నుండి నార్త్ ఇండియా కి సంబంధించిన అమ్మాయిలే హీరోయిన్స్ గా మన ఇండస్ట్రీ లో రాణిస్తూ వస్తున్నారు.
అలాంటి తరుణం లో ఒక తెలుగు అమ్మాయి ఇంత తక్కువ సమయం లో నేడు మోస్ట్ డిమాండ్ ఉన్న హీరోయిన్ గా మారిపోవడం సంతోషం. ప్రస్తుతం ఈమె చేతిలో ఏకంగా పది సినిమాలు ఉన్నాయి. వీటిల్లో కొన్ని కుర్ర హీరోల సినిమాలు కాగా, పవన్ కళ్యాణ్ మరియు మహేష్ బాబు వంటి సూపర్ స్టార్ సినిమాలు కూడా ఉన్నాయి.మిగిలిన దర్శక నిర్మాతలు కూడా శ్రీలీల డేట్స్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
అయితే ఇన్ని సినిమాలు చేస్తున్న ఆమెకి కేవలం ఒక్కో సినిమాకి గాను కోటి 50 లక్షల రూపాయిల పారితోషికం మాత్రమే ఇస్తున్నారట.అది కూడా చాలా ఎక్కువ తగ్గించుకోమని పలువురు నిర్మాతలు రిక్వెస్ట్ చేస్తున్నారట.పెద్ద హీరోల సినిమాలు అయితే కోటి 50 లక్షలు మరియు చిన్న హీరోల సినిమాలు అయితే కోటి రూపాయిల లోపే రెమ్యూనరేషన్ ఇస్తున్నారట నిర్మాతలు.ఇంత క్రేజ్ ఉన్న అమ్మాయికి ఈ పారితోషికం తక్కువే అని చెప్పాలి.
అయితే ఈమె ఒప్పుకున్న పది సినిమాలలో కనీసం నాలుగు హిట్ అయినా కూడా ఆమె రెమ్యూనరేషన్ ఒక్కో సినిమాకి నాలుగు నుండి 5 కోట్ల రూపాయిల వరకు పెంచుకోవచ్చు. మరి రాబోయే రోజుల్లో ఆమె ఆమె సత్తా ఎలా ఉండబోతుందో చూడాలి. ప్రస్తుతానికి అయితే ఈమె ధాటికి పూజ హెగ్డే, రష్మిక మందన్న మరియు కృతి శెట్టి వంటి వాళ్ళు టాలీవుడ్ లో అవకాశాలు లేక ఖాళీగా కూర్చునే పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు చెప్తున్నమాట.