Actress Sreeleela టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఒక్క సినిమాతో హిట్ భారీ హిట్ ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత సినిమాలను లైనప్ పెట్టుకుంటూ ఏకంగా అరడజను సినిమాలను చేసింది. అయితే అందులో కొన్ని మాత్రమే సూపర్ హిట్ ను అందుకున్నాయి. దాంతో కథల విషయంలో అమ్మడు ఆచి తూచి ఎంపిక చేసుకుంటున్నారు. అందుకే ఇప్పుడు సినిమాలకు గ్యాప్ తీసుకున్నారు.

ఇక సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో చూస్తూనే ఉన్నాం. హాట్ లుక్ లో అదిరిపోయే ఫోటోలను సోషల్ మీడియాలో వదులుతుంది. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ప్రముఖ విద్యాసంస్థల్లో ఒకటైన విద్యాసంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహారిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని ఆ విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు. భారతదేశంలో నెంబర్ వన్ విద్యాసంస్థలుగా ఉన్న విద్యాసంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా హీరోయిన్ శ్రీలీల ను నియమించడం ద్వారా సంస్థ మరో ముందడుగు వేస్తుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

శ్రీలీలను అంబాసిడర్ గా చెయ్యడం వల్ల జనాలకు మరింత చేరువ అవుతుందని భావిస్తున్నారు. ఇక శ్రీలీల సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ అమ్మడు సినిమాలకు గ్యాప్ తీసుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో వచ్చిన సినిమాలకు అమ్మడుకు అనుకున్న హిట్ ఇవ్వలేక పోయాయి. దాంతో తదుపరి సినిమాల ఎంపిక విషయంలో కాస్త గ్యాప్ తీసుకుంది. అంతేకాదు తన చదువు పై కూడా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. వచ్చే ఏడాది మళ్లీ సినిమాల్లో బిజీ అవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.