నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు మూవీ కి అనౌన్స్ మెంట్ తోనే ఫ్యాకప్ పడినట్లు ప్రచారం జరుగుతుంది. నవీన్ పొలిశెట్టి హీరోగా ఏడాది క్రితం అనగనగా ఒక రాజు మూవీ ని అనౌన్స్ చేశారు. ఈ చిన్న సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి దర్శకుడు త్రివిక్రమ్ సతీమణి సాయిసౌజన్య నిర్మించడానికి ముందుకొచ్చారు. అనగానగా ఒక రాజు అనౌన్స్ మెంట్ వీడియో టీజర్ అప్పట్లో వైరల్ అయ్యింది.

ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టికి జోడీగా శ్రీలీలను హీరోయిన్‌గా తీసుకున్నారు. తమన్‌ను మ్యూజిక్ డైరెక్టర్‌గా సెలెక్ట్ చేశారు. కానీ ఈ సినిమా ను ప్రకటించి ఏడాది దాటిన ఇప్పటివరకు షూటింగ్ మాత్రం మొదలుకాలేదు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆగిపోయినట్లు తెలిసింది. అనుకున్న స్థాయిలో కథ కుదరకపోవడంతో అనగానగా ఒక రోజు సినిమాను పక్కనపెట్టాలని దర్శకనిర్మాతలు నిర్ణయించుకున్నట్లు సమాచారం.

ఈ కామెడీ సినిమాకు కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించాల్సింది.కానీ అనగనగా ఒక రాజుఆగిపోవడంతో ఈ సినిమా స్థానంలో కళ్యాణ్ శంకర్‌తో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ మ్యాడ్ మూవీ చేసినట్లు సమాచారం. ధమాకా కంటే ముందు శ్రీలీల అంగీకరించిన సినిమా ఇది. ఆమె కెరీర్‌లో అనౌన్స్‌మెంట్ తర్వాత ఆగిపోయిన ఫస్ట్ మూవీగా అనగానగా ఒక రాజు నిలిచింది. ప్రస్తుతం నవీన్ పొలిశెట్టి మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాలో హీరోగా నటిస్తోన్నాడు. సెప్టెంబర్ 7న రిలీజ్ కానున్న సినిమాలో అనుష్క హీరోయిన్‌గా నటిస్తోంది.