Sreemukhi : నేను బండలా ఉన్నానని వెక్కిరించే వాళ్లు.. బాడీ షేమింగ్ కు గురయ్యానంటూ బాధపడ్డ శ్రీముఖి ..

- Advertisement -

Sreemukhi : ఉమెన్స్‌ డే సందర్భంగా ఆసక్తికర పోస్ట్‌ పెట్టింది యాంకర్‌ శ్రీముఖి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలకు శుభాకాంక్షలు చెప్పింది. పలు సందర్భాల్లో తన తల్లితో దిగిన ఫొటోలు షేర్‌ చేసిన ఆమె.. ‘‘అమ్మ ప్రయాణం నాలో ఎంతో స్ఫూర్తి నింపింది’’ అని తెలిపింది.

‘‘నా బంగారు తల్లి. ఊహ తెలిసినప్పటి నుంచి నేను చూసిన అందమైన రూపం అమ్మ. ఆమె ప్రయాణం నాలో ఎంతో స్ఫూర్తి నింపింది. ఈరోజు నేను ఈ స్థాయికి వచ్చేందుకు దోహదపడింది. ఓ మారుమూల గ్రామానికి చెందిన ఆమె.. తన కలలను సాకారం చేసుకోవడానికి ఎంతో ప్రయత్నించింది. చిన్న వయసులో వివాహ బంధంలోకి అడుగుపెట్టినప్పటికీ తనకున్న అభిరుచితో బ్యూటీషియన్‌గా మారింది. ఆ వృత్తిలో ఎన్నో మెళకువలు నేర్చుకుని అతి తక్కువ సమయంలోనే పలువురు మహిళలకు ఉద్యోగాలు ఇచ్చి ఆసరాగా నిలిచింది.

మా కుటుంబానికి విలాసవంతమైన జీవితాన్ని అందించడం కోసం ప్రతిక్షణం శ్రమించింది. ఎన్నో త్యాగాలు చేసింది. టీనేజ్‌లో ఉన్నప్పుడు నేను చాలా బొద్దుగా ఉండేదాన్ని. శరీరాకృతి విషయంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా. అలాంటి సమయంలో ఆమె ధైర్యం చెప్పింది. ప్రతిక్షణం నన్ను ప్రోత్సహించి, ప్రేమించి ఆత్మస్థైర్యంతో నిలబడేలా చేసింది. త్వరలో ఆమె 50వ వసంతంలోకి అడుగుపెట్టనుంది. ఇప్పటికీ నాలో స్ఫూర్తి నింపుతూనే ఉంది. జీవితాంతం నీకు రుణపడి ఉంటా అమ్మా’’ అని ఆమె రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here