Brahmanandam : లెజండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం కుమారుడు ఎస్పీ చరణ్ ఇటీవలే ‘కీడా కోలా’ మూవీ టీం పై కేసు వేసిన సంగతి అందరికీ తెలిసిందే. తన తండ్రి గాత్రం ని ఎలాంటి అనుమతి లేకుండా ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ సహాయం తో ఒక పాట కోసం రీ క్రియేట్ చేసారని. ఇది చట్టరీత్యా నేరమని, దీనిపై కఠినమైన యాక్షన్ తీసుకోవాలి అంటూ ఆయన కోర్టుని ఆశ్రయించాడు.

ఈ చిత్రానికి తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన చైతన్య హీరోగా, బ్రహ్మానందం ప్రధాన పాత్రలో కనిపించాడు. బ్రహ్మానందం ప్రధాన పాత్ర పోషించిన సినిమా అని కూడా చూడకుండా ఎస్పీ చరణ్ ఇలా ఆ చిత్రనిపై కోర్టు లో కేసు వెయ్యడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఎస్పీ చరణ్ వేసిన ఈ కేసు పై మూవీ టీం నుండి కానీ, తరుణ్ భాస్కర్ నుండి కానీ ఎలాంటి రెస్పాన్స్ రాలేదు.

దీంతో ఎస్పీ చరణ్ తరుపున న్యాయవాది కోర్టులో తన వాదనని మరింత తీవ్రవంతం చేస్తూ, అనుమతి లేకుండా ఎస్పీ గారు గాత్రం ఉపయోగించినందుకు ఆయన కుమారుడికి క్షమాపణలు చెప్పడమే కాకుండా కోటి రూపాయిల వరకు ఫైన్ కట్టాలి, అలాగే రాయల్టీ లో కూడా షేర్ ఇవ్వాలని డిమాండ్ చేసాడు. దీనిపై కూడా తరుణ్ భాస్కర్ నుండి ఎలాంటి రియాక్షన్ రాలేదు.

వీళ్లిద్దరి మధ్య ఏర్పడిన ఈ వివాదం ఎక్కడ వరకు దారితీస్తుందో చూడాలి. ఇకపోతే గత ఏడాది విడుదలైన ‘కీడకోలా’ చిత్రం కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమాకి సుమారుగా 6 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అంతే కాకుండా తరుణ్ భాస్కర్ దర్శకత్వం కి మాత్రమే కాకుండా, నటుడిగా కూడా మంచి పేరుని తెచ్చిపెట్టింది ఈ ‘కీడకోలా’ చిత్రం.
