తెలుగు చలన చిత్ర పరిశ్రమకి ఎంతో విలువైన ఆస్తి ఎస్ పీ బాలసుబ్రమణ్యం గారు.ఆయన ఈరోజు మన మధ్య లేకపోవడం మనం చేసుకున్న దురదృష్టం , కానీ ఆయన పాడిన ఎన్నో వేల పాట్లు ఈ భూమి సజీవంగా ఉన్నంత కాలం వినిపిస్తూనే ఉంటుంది.అందుకే ఆయనకీ మరణం లేదు, పాట రూపం లో ఎప్పుడూ ఆయన మన వెంటే ఉన్నాడు.ఆయన బౌతికంగా మన అందరికీ దూరమై అప్పుడే రెండేళ్లు పూర్తి అయ్యింది అంటే నమ్మశక్యంగా లేదు.
ఆయన చివరిసారిగా పాడిన సినిమా ‘పలాస 1978’. రఘు కుంచె సంగీత సారథ్యం లో కంపోజ్ చెయ్యబడిన ఈ పాటలలో ఒక పాటకి బాలసుబ్రమణ్యం గారు పాడారు, అదే ఆయన చివరి పాట అయ్యింది.ఇది ఇలా ఉండగా SP బాలసుబ్రమణ్యం గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు గతం లో ఆయన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.
ఒక ఇంటర్వ్యూ లో ఆయన తన భార్య గురించి చెప్పుకుంటూ చాలా ఎమోషనల్ అయ్యాడు, ఆయన వల్ల ఆమె ఎంత ఇబ్బందులు పడిందో, ఎంత నరకం చూసిందో చెప్పుకొచ్చాడు.ఆయన మాట్లాడుతూ ‘నేను నా భార్య సావిత్రిని తనకి 19 ఏళ్ళ వయస్సు ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నాను.
మేమిద్దరం ఇంట్లో తెలియకుండా చేసుకున్నాం కాబట్టి అందరూ మమల్ని దూరం పెట్టేసారు. ఆ సమయం లోనే మాకు పాప పుట్టింది. నేను ఎప్పుడూ స్టూడియో లోనే ఉంటాను, పాపకి సంబంధించిన బాగోగులు అన్నీ నా భార్యనే చూసుకునేది.
మా పాపకి ఏడాది వయస్సు ఉన్నప్పుడు కడుపులో నొప్పి వచ్చి బాగా ఏడ్చేసింది. ఆరోజు జోరు వాన, నేను ఇంట్లో ఉన్నాను కాబట్టి వెంటనే హాస్పిటల్ కి తీసుకొని వెళ్లగలిగాను, అదే నేను లేని సమయం లో నా భార్య ఒక్కటే ఉంటే పరిస్థితి ఏమిటి అని ఊహించుకొని చాలా బాధ పడ్డాను.ఇంటి పనులు చూసుకుంటూ,మరో పక్క పాప బాగోగులు చూసుకునేది. నా బిజీ లైఫ్ వల్ల ఆమె ఎన్నో కష్టాలను ఎదురుకుంది, చిత్రహింసలు అనుభవించింది, మా మధ్య అప్పుడప్పుడు ఈ విషయం లో గొడవలు కూడా జరిగాయి, కానీ వృత్తి అలాంటిది, ఏమి చేయలేము’ అంటూ బాలసుబ్రమణ్యం అప్పట్లో ఆ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.