యూట్యూబ్ లాంటి సోషల్ మీడియా మాధ్యమంలో తమ సత్తా చాటుతున్న సౌత్ స్టార్స్…

- Advertisement -

ప్రస్తుతం సోషల్ మీడియా అనేది మనిషి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. మొబైల్స్ ,ఇంటర్నెట్ లేకుండా అవి వాడకుండా దాదాపు మనిషి మనుగడే ప్రపంచంలో ప్రశాంతంగా మారింది. ఇక సినిమా విషయాలకి వస్తే సోషల్ మీడియా పుణ్యమా అని ప్రతి చిన్న విషయం వైరల్ అవుతూనే ఉంటుంది. మూవీ అనౌన్స్మెంట్ దగ్గర నుంచి షూటింగ్, టైటిల్ ,ఫస్ట్ లుక్ ,ట్రైలర్ ,టీజర్, సాంగ్స్ ఇలా రిలీజ్ కి ముందే ఎంతో హడావిడి జరుగుతుంది.

సౌత్ స్టార్స్
సౌత్ స్టార్స్

రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ డే కలెక్షన్, సెకండ్ డే కలెక్షన్స్, వన్ వీక్ కలెక్షన్, వీకెండ్ కలెక్షన్…. ఇలా నానా హడావిడి చేస్తారు. తమ అభిమాన హీరో హీరోయిన్లు సినిమా అప్డేట్స్ గురించి బర్త్ డే వంటి సందర్భాల గురించి స్పెషల్ హ్యాష్ ట్యాగ్స్ పెట్టి మరి ఫాన్స్ చేసే హడావిడి మామూలుగా ఉండదు. ఒక హీరో అభిమానుల రికార్డు మరొకరు బ్రేక్ చేయాలి అనే పోటీ కనబరిచే వారు కూడా ఉన్నారు.

ఈ నేపథ్యంలో యూట్యూబ్ ట్రెండింగ్ విషయంలో మాత్రం సౌత్ హీరోలదే గెట్టి హవా అని చెప్పవచ్చు. సౌత్ స్టార్స్ మూవీ కి సంబంధించిన ప్రతి చిన్న అంశం పై టాక్స్ క్రియేట్ చేసి యూట్యూబ్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. దీన్నిబట్టి హీరోకి సంబంధించిన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉంది అనే విషయాన్ని కూడా అంచనా వేస్తారు.

- Advertisement -

మరి యూట్యూబ్ ట్రెండింగ్ విషయంలో విజయ్ దళపతి దగ్గర నుంచి మహేష్ బాబు వరకు తెలుగు ,తమిళ్ మరియు కన్నడ పరిశ్రమలకు చెందిన టాప్ హీరోస్ ఏ రేంజ్ లో ఉన్నారో తెలుసుకుందాం…లెక్కల ప్రకారం యూట్యూబ్లో టాప్ ట్రేడింగ్ లో ఉన్న ఈ 11 మంది స్టార్స్ మరియు వాళ్ళ టాగ్స్ ఎన్ని లక్షల్లో ఉన్నాయో చూద్దాం…

దళపతి విజయ్ – 7.9 లక్షలు..

అల్లు అర్జున్ – 6.1 లక్షలు.

పవన్ కళ్యాణ్ – 5.1 లక్షలు

యశ్ – 4.7 లక్షలు

ధనుష్ – 3.9 లక్షలు.

ప్రభాస్ – 2.9 లక్షలు.

రామ్ చరణ్ – 2.7 లక్షలు.

ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ – 2.4 లక్షలు.

అజిత్ కుమార్ – 2.3 లక్షలు.

మహేష్ బాబు – 2.1 లక్షలు.

జూనియర్ ఎన్టీఆర్ – 1. 9 లక్షలు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here