Sonakshi Sinha : పెళ్లై ఐదు రోజులైనా కాలేదు అప్పుడేు ప్రెగ్నెంట్ అయిన సోనాక్షి.. ఆడుకుంటున్న నెటిజన్లు

- Advertisement -

Sonakshi Sinha : ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా జూన్ 23న తన ప్రియుడు జహీర్ ఇక్బాల్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. నేటికి వీరి వివాహం జరిగి కేవలం వారం రోజులు కూడా కాలేదు. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన రిసెప్షన్ ఫోటోలు అలాగే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతలోనే వీరిద్దరూ కోకిలా బెన్ హాస్పిటల్ నుండి బయటకు రావడం అందరిలో పలు రకాల ఊహాగానాలకు దారితీస్తోంది. ఈ విషయం చూసిన చాలామంది సోనాక్షి సిన్హా ప్రెగ్నెంట్ అయిందా అని కామెంట్స్ చేస్తున్నారు. గత ఆదివారం పెళ్లి చేసుకున్న సోనాక్షి సిన్హా, నటుడు జహీర్ ఇక్బాల్ ఇద్దరు ముంబైలోని కోకిలా బెన్ హాస్పిటల్ లో ఐదవ రోజు కనిపించడంతో.. పెళ్లి జరిగి పట్టుమని వారం కూడా కాలేదు. అప్పుడే ఈమె గర్భవతి అయ్యిందా అంటూ నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు.

పెళ్లయిన ఐదు రోజులకే ఈ కొత్తజంట ఎందుకు ఆస్పత్రికి వెళ్లిందో అర్థం కావడం లేదు. కానీ ఇలా పెళ్లయిన కొన్ని రోజులకే హాస్పిటల్లో కనిపించేసరికి.. పెళ్లికి ముందే ఈమె ప్రెగ్నెంట్ అయి ఉంటుందన్న ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతుంది. ఇకపోతే వీరి పెళ్లి గురించి సినీ ఇండస్ట్రీలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఒక హిందూ నటి .. ముస్లింని పెళ్లి చేసుకోవడంపై పలు రకాల విమర్శలు గుప్పిస్తున్నారు. ఇకపోతే శత్రుజ్ఞ సిన్హా , పూనం సిన్హా దంపతులకు మొత్తం ముగ్గురు పిల్లలు కాగా.. వారిలో లవ్ – కుష్ కవల సోదరులైతే.. సోనాక్షి సిన్హా ఒక్కగానొక్క కూతురు.

- Advertisement -

మరొకవైపు సోనాక్షి పెళ్లికి తన సోదరులు లవ్ – కుష్ కూడా రాలేదట. అంతేకాదు ముస్లింని వివాహం చేసుకోవడంపై ఆ కుటుంబ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అందుకే వారు రాలేదని తెలుస్తోంది. సోనాక్షి సిన్హా జహీర్ ఇక్బాల్ తో దాదాపు ఏడేళ్లుగా రిలేషన్ లో ఉంది. ఆమె కుటుంబాన్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం ఈమె ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో.. అసలు నిజం వేరే ఉందని అంటున్నారు. సోనాక్షి సిన్హా తండ్రి శతృఘ్న సిన్హా హాస్పిటల్‌లో చేరినట్లు సమాచారం. ముంబైలోని కోకిలాబెన్‌లో ఆయన రోటీన్ చెకప్ కోసమే చేరినట్లు సమాచారం. అయితే కూతురు పెళ్లైన ఐదు రోజులకే తండ్రి హాస్పిటల్ పాలు కావడంతో విషయం తెలిసిన సోనాక్షి అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here