Shobhitha : శోభిత రేంజ్ మామూలుగా లేదుగా.. ఆ విషయంలో సమంతనే మించిపోయింది

- Advertisement -

Shobhitha : ఇటీవల కాలంలో భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీలకు చెందిన హీరోయిన్స్ జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్నారు. అది ఏ విషయంలోనైనా సరే ఇండస్ట్రీలోకి వచ్చిన అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‎గా మారిపోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకు అనుగుణంగా బోల్డ్ రోల్స్ చేస్తూ హాట్ హీరోయిన్స్ గా మారిపోతున్నారు. అంతేకాదు అందుకు తగ్గట్లుగానే బోల్డ్ షో రేంజ్ లోనే రెమ్యూనరేషన్ కూడా తీసుకుంటున్నారు. అయితే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి చాలా కాలమే అవుతున్న ఇంకా సొంత ఇల్లు కూడా కొనుక్కోలేని హీరోయిన్లు కూడా చాలామంది ఉన్నారు. కానీ ఇండస్ట్రీలోకి వచ్చి చాలా తక్కువ సమయమే అయినప్పటికీ కోట్లకు కోట్ల ఆస్తులు సంపాదించుకున్న హీరోయిన్లు కూడా ఉన్నారు .

ప్రస్తుతం ఇప్పుడు అదే వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది. తెలుగు బ్యూటీ శోభిత ధూళిపాళ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మోడలింగ్ చేస్తూ కెరీర్‌ను ప్రారంభించింది ఈ బ్యూటీ. 2016లో రామన్ రాఘవన్ 2.0 చిత్రంతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తనదైన స్టైల్ లో దూసుకుపోయింది. గూడచారి చిత్రంతో టాలీవుడ్ లో అడుగు పెట్టి సెన్సేషనల్ హిట్ కొట్టింది. ఆ తర్వాత తెలుగు సినిమాల్లో తన హవా కొనసాగించింది. తెలుగు బ్యూటీ అయినప్పటికి హిందీలో బాగా పాపులారిటీ సంపాదించుకుంది. ప్రస్తుతం నాగచైతన్యతో డేటింగ్ లో ఉన్నట్లు ఓ వార్త బాగా హల్ చల్ చేసింది. కాగా రీసెంట్ గా శోభిత ధూళిపాళకు సంబంధించిన ఒక వార్త నెట్టింట్లో ట్రెండ్ అవుతుంది.

- Advertisement -

ఆమె ఇండస్ట్రీలోకి వచ్చి తక్కువ టైంలోనే కోట్ల రూపాయల ఆస్తి సంపాదించేసిందిట. శోభిత ధూళిపాళ పలు వెబ్ సిరీస్ లో కూడా నటించి మెప్పించింది . ఒక్కో సినిమాకు కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్న శోభిత ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 20 – 30 కోట్లకు పైగానే ఆస్తులు కూడబెట్టిందట. నిజానికి ఇండస్ట్రీకి వచ్చిన ఇంత తక్కువ టైంలో హీరోయిన్ సమంత కూడా అంత ఆస్తులు కూడబెట్టలేకపోయిందట. కానీ సమంత ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుందని అభిమానులు చర్చించుకుంటూ ఉంటారు. మొత్తానికి శోభిత, సమంత నిత్యం ఏదో ఒక అంశం కారణంగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here