Naga Chaitanya : సమంత తో విడాకులు తీసుకున్న తర్వాత నాగ చైతన్య ప్రముఖ హీరోయిన్ శోభిత దూళిపాళ్ల తో ప్రేమాయణం నడుపుతున్నాడని, అతి త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపించాయి. వీటిపై శోభిత ఇప్పటి వరకు ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు కానీ, నాగ చైతన్య మాత్రం మా మధ్య అలాంటిదేమి లేదు అని క్లారిటీ ఇచ్చాడు.
![Naga Chaitanya](https://cdn.telugucinematoday.com/wp-content/uploads/2023/12/image-621-1024x576.png)
కానీ ఈయన శోభిత కలిసి ప్రైవేట్ పార్టీలకు వెళ్లడం, వరల్డ్ టూర్స్ వెయ్యడం, ఇద్దరు కలిసి డిన్నర్లు చెయ్యడం, ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళ మధ్య ఏమి జరగడం లేదంటే చిన్న పిల్లాడు కూడా నమ్మడు. ఈమధ్య కాలం లో సెలబ్రిటీస్ అడ్డంగా దొరికిపోయిన తర్వాత కూడా మా మధ్య ఏమి లేదని చెప్పడం, ఆ తర్వాత సడన్ గా పెళ్లి చేసుకొని సర్ప్రైజ్ ఇవ్వడం చాలా కామన్ అయిపోయింది. ఈ జంట కూడా ఆ జాబితా కి చెందిన వారే, త్వరలో బయటపడతారు అని అభిమానుల నమ్మకం.
![Naga Chaitanya Shobitha](https://cdn.telugucinematoday.com/wp-content/uploads/2023/12/image-622.png)
ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా శోభిత దూళిపాళ్ల నెటిజెన్స్ కి ఫ్యూజులు ఎగిరిపోయి రేంజ్ ట్విస్టు ఇచ్చింది. ముంబై లోని ఒక ఫేమస్ రెస్టారంట్ లో గుర్తు తెలియని ఒక వ్యక్తితో ఈమె కనిపించి అందరినీ షాక్ కి గురి చేసింది. అతనితో క్లోజ్ గా మాట్లాడడం, ఒకరి చెయ్యి మీద ఒకరు వేసుకోవడం, కలిసి ఒకే హోటల్ రూమ్ లోకి వెళ్లడం, ఇవన్నీ చూసి ఇదేమి ట్విస్ట్ రా బాబు అని నెటిజెన్స్ అనుకుంటున్నారు.
![SHobitha](https://cdn.telugucinematoday.com/wp-content/uploads/2023/12/image-623.png)
శోభిత పక్కన నాగ చైతన్య ఉండాలి కానీ, ఇతను ఎవరు?, ఇండస్ట్రీ కి సంబంధించిన వ్యక్తి లాగ అసలు అనిపించడం లేదు. పోనీ శోభితకి సంబంధించిన బంధువా అంటే ఇప్పటి వరకు ఇతను శోభితా ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో కనిపించలేదు. మరి ఎవరు ఇతను అనే సందేహాలు అందరిలో నెలకొన్నాయి. దీనికి సమాధానం శోభితనే చెప్పాలి. నాగ చైతన్య అన్నట్టుగానే నిజంగా వీళ్ళ మధ్య ప్రేమ లాంటివి లేదా?, వాళ్ళు ఇలాగే క్లోజ్ గా ఉండడం చూసి మనమే తప్పుగా ఆలోచించామా అనేది చూడాలి.