Sobhan Babu అలనాటి హీరోలలో యూత్ , లేడీస్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న నటుడు శోభన్ బాబు. ఆరోజుల్లో ఆయన సినిమా వస్తుందంటే చాలు ఆడవాళ్లు థియేటర్స్ కి క్యూలు కట్టేవారు. అలాంటి స్టార్ స్టేటస్ ఆయన సొంతం. ఇప్పటికీ కూడా ఎవరికైనా లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ , లేదా ఫ్యామిలీ ఆడియన్స్ ఫ్యాన్ ఫాలోయింగ్ వస్తే దానిని కొలవడానికి శోభన్ బాబు క్రేజ్ ని కొలమానం గా తీసుకునేవారు.
సోగ్గాడిగా పిలవబడే శోభన్ బాబు ని అప్పట్లో హీరోయిన్స్ కూడా తెగ ఇష్టపడేవారు. కానీ శోభన్ బాబు మాత్రం ఒక హీరోయిన్ వెంటపడే వాడట. ఆ హీరోయిన్ పేరు ‘గీతాంజలి’. ఈమెకి ఆరోజుల్లో క్రేజ్ మామూలుగా ఉండేది కాదు. అందం కూడా అసూయ పడే రేంజ్ లో ఉండేదట ఈమె ఆరోజుల్లో. అందుకే ఆమె వెంట శోభన్ బాబు రేంజ్ అందగాడు కూడా పడ్డాడు అని అంటుంటారు.
ఇదే విషయం గురించి గతం లో గీతాంజలి ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది, ఆమె మాట్లాడుతూ ‘అప్పట్లో నా వెంట చాలామంది హీరోలు పడేవారు, శోభన్ బాబు , హర్ నాథ్ ఇలా ఎంతో మంది ఉన్నారు. ఒక సినిమాలో శోభన్ బాబు నా మేడలో తాళి కట్టే సన్నివేశం ఉంటుంది. ఆరోజు మా నాన్న గారు కూడా షూటింగ్ కి వచ్చారు. ఈరోజు ఆ సన్నివేశం ఉంటుందని నాకు తెలీదు, కానీ శోభన్ బాబు మాత్రం ఆ సన్నివేశం పేపర్ మొత్తం చదివేసి నా ముందుకు వచ్చాడు.
కాసేపట్లో నీ మేడలో మూడు ముళ్ళు వెయ్యబోతున్నాను, పక్కనే కూర్చున్న మీ నాన్న కూడా ఈరోజు నన్ను ఆపలేరు అని అన్నడం. ఒక్కసారి నేను మరియు మా నాన్న షాక్ కి గురయ్యాము.ఇదేంటి సడన్ గా ఇలా మాట్లాడుతున్నాడు. అప్పటికే పెళ్లి అయిపోయిన ఆయన మా అమ్మాయిని పెళ్లాడడం ఏమిటి అని మా నాన్న కంగారు పడిపోయాడు, ఆ తర్వాత తెలిసింది అది సీన్ కి సంబంధించింది అని, అలా శోభన్ బాబు నన్ను చాలా సార్లు సరదాగా ఆటపట్టించేవాడు’ అని చెప్పుకొచ్చింది గీతాంజలి.