Sneha Reddy టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్న జంట అల్లు అర్జున్ – స్నేహా రెడ్డి.2011 వ సంవత్సరం లో మార్చి 11 వ తేదీన వీళ్లిద్దరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంటకి ఒక పాప , ఒక బాబు ఉన్నారు.సోషల్ మీడియా ద్వారా వీళ్ళిద్దరూ అభిమానులందరికీ సుపరిచితమే..అల్లు అర్హ రీసెంట్ గా సమంత శాకుంతలం చిత్రం లో చైల్డ్ ఆర్టిస్టు గా నటించింది.భవిష్యత్తులో కూడా ఆమె మరిన్ని సినిమాల్లో బాలనటిగా బిజీ కాబోతుంది.

ఇది ఇలా ఉండగా స్నేహ రెడ్డి తండ్రి కంచర్ల చంద్ర శేఖర్ రెడ్డి మొదట్లో వీళ్లిద్దరి పెళ్ళికి ఏమాత్రం ఒప్పుకోలేదట.ఎందుకంటే ఆయనకీ సినిమా వాళ్ళ మీద మంచి ఉద్దేశ్యం ఉండేది కాదని అప్పట్లో రూమర్స్ ఉండేవి.అయితే రీసెంట్ గా చంద్ర శేఖర్ రెడ్డి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో అల్లు అర్జున్ గురించి మాట్లాడిన కొన్ని మాటలు సోషల్ లో వైరల్ గా మారాయి.

అల్లు అర్జున్ మీ దగ్గర కట్నం భారీ మొత్తం లో తీసుకున్నాడు అంటూ అప్పట్లో బాగా రూమర్స్ వచ్చాయి, ఇందులో ఎంతవరకు నిజం ఉంది అని అడగగా చంద్ర శేఖర్ రెడ్డి దానికి సమాధానం చెప్తూ ‘అల్లు కుటుంబం మా నుండి ఒక్క రూపాయి కూడా కట్నం తీసుకోలేదు.అల్లు అరవింద్ గారు వరకట్నం కి పూర్తిగా వ్యతిరేకి’ అంటూ చెప్పుకొచ్చాడు చంద్ర శేఖర్ రెడ్డి.

ఇంకా ఆయన మాట్లాడుతూ ‘పుష్ప సినిమాతో మా అల్లుడు అల్లు అర్జున్ పాన్ వరల్డ్ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది.అక్కడ ఉండే నా స్నేహితులు చెప్తూ ఉంటారు, నార్త్ లో ప్రతీ చోట అల్లు అర్జున్ సాంగ్స్ వినిపిస్తూనే ఉంటాయట.అంతే కాకుండా ఈమధ్యనే నా భార్య జమ్మూ కాశ్మిర్ కి వెళ్ళింది, అక్కడ ఆమెని ఆడియన్స్ అల్లు అర్జున్ అత్తమ్మ వచ్చింది అనే విషయం పసిగట్టి, తండోపతండాలుగా అక్కడికి వచ్చి ఆమెతో సెల్ఫీలు దిగారు..అల్లు అర్జున్ క్రేజ్ ప్రస్తుతం ఆ రేంజ్ లో ఉంది’ అంటూ చాలా గర్వం గా చెప్పుకొచ్చాడు చంద్ర శేఖర్ రెడ్డి.