Slum Dog Husband : తెలుగు సినిమా పరిశ్రమలో సీనియర్ నటుడు బ్రహ్మజీ కుమారుడు సంజయ్ రావు, బాలనటిగా నుంచి హీరోయిన్‌గా మారిన ప్రణవి మానుకొండ జంటగా నటిస్తున్న చిత్రం స్లమ్ డాగ్ హజ్బెండ్. కామెడీ, ఎమోషన్స్‌తో రూపొందిన ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ రిలీజ్ చేయనున్నది. మైక్ మూవీస్ బ్యానర్‌పై డైరెక్టర్ పూరీ జగన్నాథ్ శిష్యుడు డాక్టర్ ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో బ్రహ్మాజీ, సప్తగిరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ (జూలై 21) పోస్టర్‌ను హీరో సత్య దేవ్ విడుదల చేశారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో చిత్ర యూనిట్ మాట్లాడుతూ..
నటుడు బ్రహ్మాజీ మాట్లాడుతూ.. నా కొడుకు హీరోగా ఎదిగినందుకు సంతోషంగా ఉంది. కానీ ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. నా కొడుకుకు సపరేట్‌గా నేనేమీ సలహాలు ఇవ్వలేదు. ఈ తరంలో హీరోలు అందరూ సహజంగానే నటిస్తున్నారు. ఈ సినిమాలో ఓ పాత్ర కోసం నన్ను అప్రోచ్ అయ్యారు. తరువాత హీరో కోసం మా అబ్బాయిని తీసుకున్నారు. కథలు ఎంచుకోవడం, సినిమాలు సెలెక్ట్ చేసుకునే విషయంలో నేను నా కొడుక్కి ఎలాంటి సలహాలు ఇవ్వను. నా కొడుకు మొదటి సినిమాకు చిరంజీవి గారు, మహేష్ బాబు గారు, ఎన్టీఆర్ గారు ముందుకు వచ్చి ప్రమోషన్స్ చేశారు. ప్రతీ సినిమాకు అలా అందరినీ పిలవడం బాగుండదు. మొదటి సినిమాకు అందరూ ఆశీర్వాదం అందించారు. తరువాత అన్నీ సినిమాలు మన కష్టం మీద ఆధారపడి ఉంటుంది.’ అన్నారు.
డైరెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ.. హీరోయిన్ పాత్ర కోసం చాలా మందిని ఆడిషన్స్ చేశాను. పక్కింటి అమ్మాయిలా ప్రణవి బాగా సెట్ అవుతుందని ఆమెను హీరోయిన్‌గా తీసుకున్నాం. ఈ చిత్రంలో ఎలాంటి అడల్ట్ కంటెంట్ ఉండదు. డాగ్‌కు మెయిల్ వాయిస్ పెట్టాం. కానీ అందులోనూ ఓ ట్విస్ట్ ఉంటుంది. పూరి జగన్నాథ్ సర్ దగ్గర నేను అసిస్టెంట్‌గా పని చేశాను. మనుషులకంటే జంతువులే విధేయంగా ఉంటాయి. ఐశ్వర్య రాయ్ చెట్టుని పెళ్లి చేసుకుంది.