Skanda : ఎనెర్జిటిక్ స్టార్ రామ్ మరియు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన ‘స్కంద’ అనే చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై నెగటివ్ టాక్ ని తెచ్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ రామ్ కి మాస్ లో మంచి క్రేజ్ ఉండడం, అలాగే బోయపాటి శ్రీను లాంటి ఊర మాస్ డైరెక్టర్ ఈ చిత్రానికి దర్శకుడు అవ్వడం తో ఓపెనింగ్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో దద్దరిల్లిపోయాయి.
రామ్ ఇప్పటి వరకు తీసిన అన్నీ సినిమాలలో ఈ చిత్రానికే ఆల్ టైం రికార్డు వచ్చింది అని అంటున్నారు ట్రేడ్ పండితులు. ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతం వసూళ్లు అదిరిపోయాయి. నూన్ మరియు మ్యాట్నీ షోస్ తో పోలిస్తే ఫస్ట్ షో మరియు సెకండ్ షోస్ కి ఎక్కువ హౌస్ ఫుల్స్ నమోదు అయ్యాయి. ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి ఎంత వసూళ్లు వచ్చాయో ఒకసారి చూద్దాం.
ముందుగా ఈ చిత్రానికి నైజాం ప్రాంతం లో 3 కోట్ల 23 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. న్యాచురల్ స్టార్ నాని ‘దసరా’ కి మొదటి రోజు ఇక్కడ 6 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. కానీ ‘స్కంద‘ కి అందులో సగమే వచ్చింది. అలాగే సీడెడ్ లో కోటి 22 లక్షల రూపాయిల షేర్ వచ్చింది. ఇది ఈ ప్రాంతం లో యావరేజి ఓపెనింగ్ అని చెప్పొచ్చు.
ఇక ఆ తర్వాత ఉత్తరాంధ్ర లో కోటికి 20 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 59 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 49 లక్షలు, కృష్ణ జిల్లాలో 45 లక్షలు, గుంటూరు జిల్లాలో కోటి 4 లక్షల రూపాయిలు, నెల్లూరు జిల్లాలో 49 లక్షణాలు రూపాయిలు వచ్చాయి. ఒక్క నైజాం మరియు సీడెడ్ ప్రాంతం లో తప్ప, మిగిలిన అన్నీ ప్రాంతాలలో స్కంద ఓపెనింగ్స్ అదిరాయి. ఓవరాల్ రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ సినిమాకి 8 కోట్ల 62 లక్షల రూపాయిలు వచ్చాయి.