Skanda : ఎనెర్జిటిక్ స్టార్ రామ్ మరియు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన ‘స్కంద’ చిత్రం రీసెంట్ గానే గ్రాండ్ గా విడుదలై మొదటి ఆట నుండే నెగటివ్ టాక్ ని తెచ్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే. నెగటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా ఈ సినిమాకి ఓపెనింగ్స్ అదిరిపోయాయి. కేవలం మొదటి రోజు మాత్రమే కాదు, దాదాపుగా నాలుగు రోజుల పాటు అన్నీ మాస్ సెంటర్స్ లో అదిరిపోయే రేంజ్ వసూళ్లు వచ్చాయి.

కాంబినేషన్ అలాంటిది మరీ. దానికి తోడు సెలవులు కూడా బాగా కలిసొచ్చాయి. ఫలితంగా ఈ చిత్రం ఆరు రోజుల వరకు నాన్ స్టాప్ గా కోటి రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది. అంతే కాకుండా రామ్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనర్ గా కూడా నిల్చింది ఈ చిత్రం. అయితే వారం రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూళ్లు వచ్చాయో ఒకసారి చూద్దాం.

ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా 46 కోట్ల రూపాయలకు జరిగింది. మొదటి వారం ఇప్పటి వరకు ఈ చిత్రానికి 28 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. సాధారణంగా బోయపాటి శ్రీను సినిమాలకు ఫ్లాప్ టాక్ వస్తే ఓవర్సీస్ లో దారుణమైన వసూళ్లు వస్తాయి. కానీ స్కంద చిత్రానికి డీసెంట్ స్థాయి వసూళ్లు నమోదు అయ్యాయి. మొదటి వారం లో ఈ చిత్రానికి దాదాపుగా రెండు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

అలాగే నైజాం ప్రాంతం లో కూడా ఈ చిత్రం ఊహకి అందని వసూళ్లను రాబట్టింది. మొదటి వారం లో ఇక్కడ ఈ చిత్రానికి దాదాపుగా 9 కోట్ల 70 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. కానీ సీడెడ్ లో మాత్రం మూడు కోట్ల 60 రూపాయిల షేర్ ని మాత్రమే రాబట్టింది. ఇక ఈ వీకెండ్ కూడా సినిమాలేవీ పెద్దగా లేకపోవడం తో ఈ చిత్రం మరో 5 కోట్ల రూపాయిలు ఫుల్ రన్ అదనంగా రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు. టాక్ బాగాలేకపోయినా ఈ మాత్రం వసూళ్లు వచ్చాయంటే చాలా గ్రేట్ అని అంటున్నారు ట్రేడ్ పండితులు.