సూపర్ స్టార్ మహేష్ కుమార్తె సితార ఘట్టమనేని సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. చిన్న వయసులోనే యూ ట్యూబ్ ఛానెల్‌ను స్టార్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపచిన ఆమె ఇప్పుడు మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. అంతలా సితార ఏం చేసింది? అందుకు కారణమేంటనే వివరాల్లోకి వెళితే, రీసెంట్‌గా సితార ఓ కమర్షియల్ యాడ్‌లో నటించింది. అది కూడా ఓ జ్యూయెలరీ సంస్థకు సంబంధించిన ప్రకటన. చిన్న వయసులోనే ఆమె కమర్షియల్ యాడ్‌లో నటించటమనేది నిజంగానే సూపర్‌స్టార్ అభిమానులను సంతోషపడేలా చేసింది. రీసెంట్‌గానే దానికి సంబంధించిన షూటింగ్‌ను సితార పూర్తి చేసింది. ఆ మధ్య దానికి సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్ అయ్యాయి. కాగా.. ఇప్పుడు సితార నటించిన కమర్షియల్ యాడ్‌కు సంబంధించిన ఫొటోలను ప్రెస్టీజియస్ న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో ప్రదర్శించారు. ఇప్పుడు దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

సితార కమర్షియల్ యాడ్‌లో నటించిందనే తెలియగానే చాలా మంది.. తండ్రి తగ్గ కుమార్తె అని ఆమెను అప్రిషియేట్ చేశారు. చిన్నప్పటి నుంచి టాలెంటెడ్ కిడ్‌గా గుర్తింపు పొందిన సితారకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను నమ్రతా శిరోద్కర్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తున్నారు. మరీ ముఖ్యమంగా పలు పాటలకు ఆమె డాన్స్ చేసిన వీడియోలతో పాటు భరతనాట్యం చేసిన సితార వీడియోలను కూడా నమత్ర పోస్ట్ చేస్తూ ముచ్చట పడిపోతుంటారు. ఈ వయసులోనే ఇంత షార్ప్‌గా ఉన్న సితార మరి తండ్రి అడుగు జాడల్లో నటన వైపు అడుగులేస్తుందా? లేక మరేదైనా రంగంలో రాణిస్తుందో తెలుసుకోవాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

ఈ క్రమంలోనే అసలు పీఎంఆర్ జ్యువెలరీ కోసం చేసిన యాడ్ కోసం సితార ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంది అనే విషయం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం.. సితార ఘట్టమనేని ఈ యాడ్ కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు అంటూ తెలుస్తుంది . మహేష్ బాబు ఒక్క రూపాయి కూడా తీసుకొని కుండానే ఈ యాడ్లో నటించడానికి ఒప్పుకున్నారట . అయితే సదరు సంస్ధ మాత్రం గిఫ్ట్ కింద సితార ఘట్టమనేని కు ఓ డైమండ్ నెక్ సెట్ – రింగ్ – బ్రేస్లెట్ గిఫ్ట్ చేసినట్టు తెలుస్తుంది .వీటి విలువ సుమారు రూ.15 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది.