Siri Hanumanth : ఒక సాధారణ యూట్యూబర్ గా కెరీర్ ని ప్రారంభించి, ఆ తర్వాత షార్ట్ ఫిలిమ్స్ ద్వారా బాగా ఫేమస్ అయ్యి, బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన సెలబ్రిటీ సిరి. ఈమెకి సోషల్ మీడియా లో ఉన్న క్రేజ్ మామూలుది కాదు. బిగ్ బాస్ ద్వారా వచ్చిన పాపులారిటీ తో ఈమెకి సినిమాల్లో కూడా అవకాశాలు క్యూలు కడుతున్నాయి.

రీసెంట్ గానే బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ హీరో గా నటించిన ‘జవాన్’ చిత్రం లో ఒక చిన్న పాత్ర పోషించింది. ఈ సినిమా ద్వారా ఆమె ఏకంగా పాన్ ఇండియన్ ఆడియన్స్ కి పరిచయం అయ్యింది. ఈ రేంజ్ వస్తుందని బహుశా సిరి కూడా ఊహించి ఉండదు. ఈ చిత్రం తో పాటుగా ఈమె ఇప్పుడు తెలుగు లో కూడా పలు సినిమాల్లో ముఖ్యమైన పాత్రలు పోషిస్తుంది.

ఇదంతా పక్కన పెడితే లేటెస్ట్ గా ఈమె ఈటీవీ లో ప్రసారమయ్యే పాపులర్ కామెడీ షో జబర్దస్త్ కి యాంకర్ గా రాబోతుంది. ప్రతీ శుక్రవారం ప్రసారమయ్యే జబర్దస్త్ షో కి అప్పట్లో యాంకర్ అనసూయ పనిచేసేది. ఆమె తర్వాత పలువురు యాంకర్స్ పనిచేసారు కానీ, ఇప్పుడు సిరి మాత్రం శాశ్వతంగా ఫిక్స్ అయిపోయినట్టు తెలుస్తుంది. యాంకర్ రష్మీ ఒక్కో ఎపిసోడ్ కి దాదాపుగా రెండు లక్షల రూపాయిలు అందుకుంటుంది.

కానీ సిరి కి మల్లె మాల ఎంటర్టైన్మెంట్స్ వారు దాదాపు గా మూడు లక్షల 50 వేల రూపాయిలు ఒక్కో ఎపిసోడ్ కి ఇవ్వడానికి ఒప్పుకున్నారట. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన అంశం. యాంకర్ రష్మీ ని మించిపోయే రేంజ్ కి సిరి వచ్చేసిందా అనే చర్చలు కూడా మొదలయ్యాయి. మరి ఆమె కెరీర్ ని ఇదే రేంజ్ లో ముందుకు సాగిస్తుందో లేదో చూడాలి.