Siri Hanumanth : ప్రముఖ యూట్యూబర్, బిగ్‌బాస్ ఫేం షణ్ముఖ్ జస్వంత్ గంజాయి కేసులో ఇటీవల పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. షార్ట్ ఫిల్మ్స్, యూట్యూబ్ వీడియోస్, వీడియో సాంగ్స్, వెబ్ సిరీస్‌లు చేస్తూ షణ్ముఖ్ యువతో సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక మరో యూట్యూబర్ దీప్తి సునయనతో కలిసి సాగిన ప్రేమాయణం ఇంకా పాపులర్ అయింది. ఈ క్రమంలో షణ్ముఖ్‌కు మరింత పాపులారిటీ వచ్చింది. ఆ పాపులారిటీతోనే బిగ్‌బాస్‌లో పాల్గొనే అవకాశం దక్కించుకున్నాడు.

అయితే బిగ్‌బాస్‌లో మరో కంటెస్టెంట్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన సిరి హన్మంత్‌తో షణ్ముఖ్ ప్రవర్తించిన తీరు, ఇరువురు బిగ్‌బాస్ హౌస్‌లో చట్టాపట్టాలేసుకుని తిరగడం, హగ్గులు, ముద్దులతో రచ్చ చేయడం అప్పట్లో కాస్త సంచలనం అయింది. ఇరువురికి బయట లవర్ ఉండటంతో బిగ్‌బాస్ హౌస్‌లో ఈ ఇద్దరు అత్యంత సన్నిహితంగా ఉండటం అప్పట్లో వివాదాస్పదం అయింది. ప్రేక్షకులు కూడా వీరి ప్రవర్తన చూసి ముక్కున వేలేసుకున్నారు.
ఇక బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సిరి పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ సాఫీగా సాగిపోతున్నా.. షణ్ముఖ్‌కు మాత్రం బ్రేక్ పడింది. హౌస్ నుంచి బయటకు రాగానే ప్రేయసి దీప్తి సునయనతో బ్రేకప్ కావడం అతణ్ని కుంగదీసినట్లు సమాచారం. మరోవైపు కెరీర్ కూడా స్లో కావడంతో డిప్రెషన్‌లోకి వెళ్లినట్లు తెలిసింది. ఇటీవల గంజాయి కేసులో ఇరుక్కున్న సమయంలో పలు వీడియోలు వైరల్ అయ్యాయి. అందులో ఓ వీడియోలో తాను డిప్రెషన్‌తో బాధపడుతున్నానని, చచ్చిపోదామని కూడా అనుకున్నట్లు షణ్ముఖ్ చెప్పడం సంచలనంగా మారింది.

ఇలా గంజాయి కేసులో ఇరుక్కున్న షణ్ముఖ్ గురించి తాజాగా తన కో కంటెస్టెంట్ సిరి హన్మంతు మరోసారి నోరువిప్పింది. షణ్ముఖ్ అరెస్టుపై మాట్లాడుతూ అతడి పర్సనల్ లైఫ్ ఇలా అవుతుందని అనుకోలేదని చెప్పుకొచ్చింది. అయితే బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక షణ్ముఖ్‌కు దీప్తితో బ్రేకప్ అవ్వడంతో అప్పటి నుంచి అతడితో కాంటాక్ట్‌లో లేనని తెలిపింది. అతడిని కలవడం, మాట్లాడటం కరెక్ట్ కాదని అనిపించిందని వివరించారు. మరోవైపు ఎవరి కెరీర్‌లో వారు బిజీ కావడంతో ఒకరి గురించి మరొకరికి పట్టించుకునే టైం లేకపోయిందని చెప్పింది. అయితే తాము మాట్లాడుకున్నా మాట్లాడుకోకపోయినా షణ్ముఖ్ పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ బాగుండాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది ఈ అమ్మడు.