Singer Sunitha : కొత్త ప్రియుడు దొరికితే సంబరాలు చేసుకోవాలి కదా అంటూ సింగర్ సునీత షాకింగ్ కామెంట్స్!

- Advertisement -

Singer Sunitha : తన అద్భుతమైన గాత్రం తో ఎన్నో ఏళ్ళ నుండి ఇండస్ట్రీ లో స్టార్ సింగర్ గా కొనసాగుతున్నారు సునీత గారు. అందమైన రూపం తో స్టార్ హీరోయిన్స్ కి ఏమాత్రం తీసిపోని గ్లామర్ ఉన్నప్పటికీ, ఆమె కేవలం సింగర్ గానే ఇండస్ట్రీ లో స్థిరపడింది. గులాబీ చిత్రం లో ‘ఈ వేళలో నీవు..ఏం చేస్తూ ఉంటావో’ అనే పాట ద్వారా ఈమె ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది.

Singer Sunitha
Singer Sunitha

తొలిపాటతోనే అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కించుకున్న సునీత కి టాలీవుడ్ లో అవకాశాలు క్యూ కట్టాయి. అలా దాదాపుగా 11 వేల పాటలు పాడిన సునీత ఇప్పటికీ కూడా మంచి డిమాండ్ ఉన్న సింగర్ గా ఇండస్ట్రీ లో కొనసాగుతూనే ఉంది. ఇది ఇలా ఉండగా రీసెంట్ గానే ఈమె మ్యాంగో మ్యూజిక్ సంస్థ అధినేత రామ్ ని రెండవ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్ళికి ఎదిగిన పిల్లల్ని పెట్టుకొని నువ్వు పెళ్లి చేసుకోవడం ఏమిటి అని సునీత పై ట్రోల్స్ వచ్చినా కూడా ఆమె పెద్దగా పట్టించుకోలేదు.

Singer Sunitha Comments

ఇది ఇలా ఉండగా రీసెంట్ గానే ఈమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ప్రేమ, పెళ్లి గురించి చేసిన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి. ఆమె మాట్లాడుతూ ‘ఈమధ్య కాలం లో చాలా మంది ఎంత తొందరగా ప్రేమించుకుంటున్నారో, అంతే తొందరగా విడిపోతున్నారు. ఏదైనా పెద్ద పెద్ద కారణాల వల్లనో, లేకపోతే ఏదైనా ఆరోగ్య సమస్యల వల్లనో విడిపోయారంటే ఒక అర్థం ఉంది. కానీ చిన్న చిన్న గొడవలకు విడాకులు తీసుకున్న వాళ్ళను నేను ఈమధ్య కాలం లో చాలా మందిని చూసాను. అసలు వీళ్ళు ఎందుకు ఇలా విడాకులు తీసుకుంటున్నారు అనేది అర్థం అయ్యేది కాదు. మళ్లీ విచిత్రం ఏమిటంటే బ్రేకప్ జరిగినందుకు ఒక పార్టీ, కొత్త లవర్ వచ్చినప్పుడు మరో పార్టీ చేసుకుంటున్నారు. ఇదెక్కడి విచిత్రమో అర్థం కాదు’ అంటూ సునీత చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here