Singer Kousalya గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. తన అద్భుతమైన గాత్రంతో ఎన్నో పాటలు పాడి శ్రోతలను అలరించింది.. ఈమె వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడిందని ఇప్పటికే ఎన్నోసార్లు మీడియాతో తెలిపింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నా కౌసల్య తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు..

తన పెళ్లి జరిగిన కొద్ది రోజులకే తన భర్త తనను హింసించి, కొట్టడం మొదలుపెట్టారని.. అంతేకాకుండా తనను వదిలేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చూశారని తెలిపింది. కాగా ఆ విషయంలో కౌసల్య కూడా అడ్డుపడలేదట. ఇక అదే సమయంలో తనకి ఒక బాబు పుట్టడంతో కౌసల్య తన భర్తకు విడాకులు ఇచ్చి తన బాబుని తీసుకొని పుట్టింటి వెళ్లి అక్కడి నుంచే జీవితాన్ని కొనసాగిస్తుంది.
ప్రస్తుతం కౌసల్య కొడుకుకి 18 సంవత్సరాలట. కొడుకు కూడా మెచ్యూరిటీ ఏజ్ కి రావడం వల్ల కౌసల్య ను చూసి ప్రతిసారి మా కోసం నీ జీవితాన్ని త్యాగం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు మరో పెళ్లి చేసుకో అని తరచూ సలహా ఇస్తూ ఉండేవాడట.. అలా ఎన్నిసార్లు చెప్పినా కౌసల్య వినకపోవడంతో.. ఈసారి నువ్వు రెండో పెళ్లి కచ్చితంగా చేసుకోవాలని పట్టుబట్టి మరీ చెప్పాడట. దాంతో కౌసల్య కూడా పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైందని తెలుస్తోంది.
కౌసల్య మొదటి పెళ్లి వల్ల ఓ చేదు అనుభవాన్ని ఎదుర్కొంది. అందుకే తన నిర్ణయాలను కాదనకుండా.. తన అభిరుచులకు తగ్గట్టుగా ఉండే వ్యక్తి దొరికితే కచ్చితంగా వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని తెలిపింది. దాంతో కౌసల్య రెండో పెళ్లికి సిద్ధం అయ్యింది అంటూ సోషల్ మీడియాలో రకరకాల కామెంట్ లు చేస్తున్నారు. ఇక కౌసల్య పెళ్లి చేసుకునే ఆ వ్యక్తి ఎవరయి ఉంటారా అంటూ.. అతను ఎక్కడున్నాడో అంటూ నెటిజన్లు కూడా ఆరా తీయడం మొదలుపెట్టారు. ఏది ఏమైనా కౌసల్య మరో పెళ్లికి సిద్ధమవుతూ ఉండడం అందరిని ఒకవైపు ఆశ్చర్యానికి మరొకవైపు సంతోషానికి గురిచేస్తుంది.