Simran : సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్నప్పటికీ.. వారిలో కొంతమంది మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతారు. అలా అందరి మనసులు గెలుచుకుని కుర్రాళ్ల కలల రారాణిగా ఓ వెలుగొందుతున్న హీరోయిన్ సిమ్రాన్. తన నడుమందాలతో మగాళ్ల గుండెల్లో గుబులు పుట్టించింది. ఆ నడుము కోసమైనా సినిమాకు వెళ్లే వారు జనాలు. ఈ ముద్దుగుమ్మ మహారాష్ట్రలో పుట్టి పెరిగింది. అప్పట్లో టాలీవుడ్ టాప్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. 1999 సంవత్సరం నుంచి 2004 వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో తన హవా కొనసాగించింది. బాలయ్య, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున లాంటి స్టార్స్ అందరి సరసన నటించి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

అయితే కెరీర్ పీక్ స్టేజీలో ఉన్నప్పుడే.. డాన్స్ మాస్టర్ రాజు సుందరంతో రిలేషన్ షిప్ పెట్టుకుందట ఈ ముద్దుగుమ్మ. వీరిద్దరూ ఒకానొక టైంలో పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారట. ఈ క్రమంలో సిమ్రాన్ ఏ హీరోతో కొంచెం చనువుగా ఉన్నా రాజు సుందరానికి నచ్చేది కాదట. వెంటనే సిమ్రాన్ కు వార్నింగ్ ఇచ్చేవాడట. అలాంటిది కమల్ హాసన్ తో ఓ సినిమాలో లిప్ లాక్ సీన్లో సిమ్రాన్ నటించింది. ఆ సీన్ చేయడం.. కమల్ హాసన్ కు లిప్ లాక్ ఇవ్వడం రాజు సుందరానికి అస్సలు నచ్చలేదట.
ఈ విషయంపై సిమ్రాన్ తో మాట్లాడేందుకు బయటకు తీసుకెళ్లాడట. అక్కడ రాజు సుందరానికి, సిమ్రాన్ కు గొడవ జరిగిందట. దీంతో నడిరోడ్డు పైనే సిమ్రాన్ ను వదిలేసి వచ్చేసాడట రాజు సుందరం. అలా సిమ్రాన్ రోడ్డుపై పడిందన్న వార్తలు అప్పట్లో తెగ హల్ చల్ చేశాయి. మరోసారి ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.