సినీ పరిశ్రమలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన శృంగార తార సిల్క్ స్మిత. తన సినిమా వస్తుందంటే పెద్ద హీరోలే భయపడేలా చేసిన మరో తార షకీలా. వీరిద్దరి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సిల్క్ స్మిత ఎంత గొప్పగా జీవించిందో.. పేరు, డబ్బు ఎంత సంపాదించినప్పటికీ చివరికి ఆమె ఇతరుల చేతుల్లో మోసపోయి అర్ధాంతరంగా ఆత్మహత్య చేసుకుని మరణించింది. మరో శృంగార తార షకీలా కూడా తన సినిమాలతో బాగానే సంపాదించింది. కానీ తన సొంత కుటుంబ సభ్యుల చేతిలో మోసపోయింది. ఇలా ఇద్దరి జీవితాలు ఒకే కోవకు చెందినవిగా కనిపిస్తుంటాయి. షకీలా ఇటీవల బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో అడుగు పెట్టింది. ఎప్పుడైతే షకీలా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిందో అప్పటినుంచి ఈమె గురించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
గతంలో సిల్క్ స్మిత.. షకీలాని అందరు ముందే కొట్టి అవమానించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి సిల్క్ స్మిత.. షకీలా సినిమాల్లోకి రాకముందే ఇండస్ట్రీలో అడుగుపెట్టి పలు చిత్రాల్లో నటించింది. షకీలా మాత్రం ప్లే గర్ల్స్ అనే చిత్రంతో తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో షకీలాతో పాటు సిల్క్ స్మిత కూడా నటించిందట. అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత సిల్క్ స్మిత కంటే షకీలాకే పేరు వచ్చిందట. అలా ఈ సినిమా తర్వాత షకీలాకు వరుస అవకాశాలు వచ్చాయి.
షకీలాని సిల్క్ స్మిత ప్లే గర్ల్స్ అనే సినిమా చేసే సమయంలోనే కొట్టిందట.. సిల్క్ స్మిత అప్పటికే మద్యానికి బానిసయ్యిందట. షూటింగ్ టైంలో సిల్క్ స్మిత తాగి వచ్చి.. ఎక్కువ టేక్స్ తీసుకోవడంతో షకీలా ఇలా చేస్తే బాగుంటుందని తనతో చెప్పిందట.. అలా తనతో చెప్పిందన్న కోపంతో సిల్క్ స్మిత చేయి చేసుకుని అవమానించిందని సమాచారం. అలా కొట్టినందుకు అవమానంగా ఫీలై షకీలా వెంటనే తన ఇంటికి వెళ్లిపోయిందట.