Silk Smitha : ఒకప్పుడు కుర్రాళ్ల కలల రాణిగా వారి హృదయాలను ఏలేసింది సిల్క్ స్మిత. ప్రేక్షకుల ఆరాధ్యదైవంగా ఆమె క్రేజ్ తెచ్చుకుంది. ఈమె జీవితం సినిమాకు మించిన నాటకం. ఒక నిరుపేద కుటుంబంలో పుట్టిన విజయలక్ష్మికి చిన్న వయసులోనే పెళ్లయింది. అత్తగారి వేధింపులు భరించలేక మద్రాసు రైలు ఎక్కి పారిపోయింది. కనీస విద్యార్హత లేకుండా మద్రాసు వచ్చిన విజయలక్ష్మి ఇక్కడికి వచ్చిన తర్వాత తన పేరును సిల్క్ స్మితగా మార్చుకుని జీవన పోరాటం మొదలు పెట్టింది. మేకప్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా మారింది. ఆమె సినిమా వస్తుందంటే చాలా ప్రేక్షకులు ఆరోజు రాత్రి నుంచే థియేటర్ల దగ్గర జాగారం చేసేవారు. అలా సినిమా సక్సెస్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ స్థాయిలో సిల్క్ స్మితకు క్రేజ్ వచ్చింది. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా వందల సినిమాల్లో నటించింది. కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో ఆమె ఆత్మహత్యకు పాల్పడి అభిమానులను షాక్‌కు గురి చేసింది.
1996లో సిల్క్ స్మిత చెన్నైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకుంది. కోట్లాది మంది అభిమానులు ఉన్నా.. సిల్క్ స్మిత అంత్యక్రియలు ఓ అనాథ శవానికి జరిగినట్లు జరిగాయి. ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఆసుపత్రి సిబ్బందే అంత్యక్రియలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఒక్క అర్జున్ సజ్జా తప్ప ఆమె అంత్యక్రియలకు ఎవరూ హాజరు కాలేదు. సిల్క్ స్మిత చనిపోయి మూడు దశాబ్దాలు గడిచాయి. తాజాగా సీనియర్ నటి జయమాలిని ఓ ఇంటర్వ్యూలో తన మరణంపై చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. సిల్క్ స్మిత చేసిన తప్పిదమే తన మరణానికి కారణమని తెలిపింది. తక్కువ సమయంలోనే సిల్క్ స్మితకు పేరు, డబ్బు వచ్చిందని జయ మాలిని అన్నారు. షూటింగ్ సెట్స్‌లో ఆమె నాతో అసలు మాట్లాడలేదు. సిల్క్ స్మిత, నేను, మా సోదరి జ్యోతిలక్ష్మి కలిసి ఓ సినిమాలో నటించాం.
ఫామ్ లో ఉన్న టైంలో ఆమె ఆత్మహత్య చేసుకోవడం ఆమె చేసిన అతి పెద్ద తప్పు. ప్రేమించడం తప్పు కాదు.. కానీ తల్లిదండ్రులకు దూరం కావడమే ఆమె చేసిన అసలు తప్పు. సిల్క్ స్మిత తన ప్రియుడిని గుడ్డిగా నమ్మి మోసపోయింది. ఆమె తల్లిదండ్రులు అక్కడ ఉంటే ఆమెను ఓదార్చేవారు. అయితే తల్లిదండ్రులు లేని సమయంలో మోసం చేసేందుకు చాలా మంది సిద్ధంగా ఉంటారు. అలాగే స్మితపై కూడా పట్టు పడింది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. సిల్క్ స్మిత చనిపోయినప్పుడు రాసిన సూసైడ్ నోట్ ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెళ్లి పేరుతో సిల్ స్మితను ఓ కోలీవుడ్ స్టార్ హీరో మోసం చేయగా.. కొందరు ఉద్యోగులు కూడా ఆమెను మోసం చేశారు. ఆమె మరణానికి ఇది కూడా కారణమని అప్పట్లో వార్తలు వచ్చాయి.