Manchu Manoj : మంచు మోహన్ బాబు తనయుడిగా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపుని తెచ్చుకున్న మంచు మనోజ్ కొంతకాలం గ్యాప్ తర్వాత మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. సినిమా కంటే ముందుగా ఆయన ఈటీవీ లో ‘ఉస్తాద్’ అనే గేమ్ షో ద్వారా ఆడియన్స్ ని పలకరించాడు. ఈ గేమ్ షో లో ప్రముఖ టాప్ సెలబ్రిటీస్ తో ఆయన టాక్ షో నిర్వహించి మధ్యలో కొన్ని ఆటలు ఆడుతాడు.

ఈమధ్యనే ప్రారంభమైన ఈ షో కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. తొలి ఎపిసోడ్ కి న్యాచురల్ స్టార్ నాని విచ్చేశాడు. ఆ తర్వాత డీజే టిల్లు హీరో సిద్దు జొన్నలగడ్డ మరియు దగ్గుపాటి రానా విచ్చేసారు. సిద్దు జొన్నలగడ్డ తో చేసిన ఎపిసోడ్ అతి త్వరలోనే టెలికాస్ట్ కాబోతుంది. అయితే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

సిద్దు జొన్నలగడ్డ సినిమాలలో ఎక్కువగా ముద్దు సన్నివేశాలు ఉంటాయి అన్న సంగతి తెలిసిందే. ఈ విషయమై మనోజ్ సిద్దు ని అడుగుతూ ‘మీ సినిమాలో స్క్రిప్ట్ రాసే ముందు ‘ఓం’ కి బదులుగా ‘కిస్’ అని రాస్తారట కదా’ అని అడుగుతాడు. దానికి ఏమి సమాధానం చెప్పాలో తెలియక సిద్దు నవ్వేస్తాడు.

ఆ తర్వాత డీజే టిల్లు సినిమాలో లాంగ్ ఐరన్ రాడ్ అని ఎదో అంటావ్ కదా, నిజ జీవితం లో ఎన్ని రాడ్లు పడ్డాయి అని అడుగుతాడు. అప్పుడు సిద్దు ‘మీరు జాకెట్ తీసేస్తే ఈ రేంజ్ ప్రశ్నలు అడుగుతారని అనుకోలేదు’ అని అంటాడు. అలా షో మొత్తం మంచు మనోజ్ వేసే పంచులు ఏమి సమాధానం చెప్పాలో తెలియక షో అని పిలిచి ఇలా అవమానిస్తారా అంటూ సిద్దు జొన్నలగడ్డ సరదాగా ఒక డైలాగ్ వేస్తాడు. అలా ఈ ఎపిసోడ్ మొత్తం అలా సరదాగా గడిచిపోయింది అట.
