Anupama Parameswaran : ప్రస్తుతం సౌత్ లో ఉన్నటువంటి యంగ్ హీరోయిన్స్ లో యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో అనుపమ పరమేశ్వరన్ కచ్చితంగా ఉంటుంది. త్రివిక్రమ్ , నితిన్ కాంబినేషన్ లో వచ్చిన ‘అ..ఆ’ చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైన ఈమె కెరీర్ లో సూపర్ హిట్స్ శాతం తక్కువే అయ్యినప్పటికీ, అందం మరియు యాక్టింగ్ టాలెంట్ కావాల్సినంత ఉండడం తో ఈమెకి యూత్ లో ఆ రేంజ్ క్రేజ్ ఏర్పడింది.

ముఖ్యంగా ఈమె ఉంగరాల జుట్టు అంటే యూత్ ఆడియన్స్ కి ఎంత ఇష్టమో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఐటీవాలె ఈమె రవితేజ హీరో గా నటించిన ‘ఈగల్’ చిత్రం లో ఒక ముఖ్య పాత్ర పోషించింది. ఈ క్యారక్టర్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ దక్కింది. ఈ సినిమా తర్వాత అనుపమ పరమేశ్వరన్ ‘టిల్లు స్క్వేర్’ చిత్రం ద్వారా మన ముందుకు రాబోతుంది.

2022 వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో విడుదలైన ‘డీజే టిల్లు’ చిత్రానికి ఇది సీక్వెల్ అని చెప్పొచ్చు. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని రీసెంట్ గానే విడుదల చెయ్యగా దానికి ఆడియన్స్ నుండి బంపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ ట్రైలర్ లో అనుపమ పరమేశ్వరన్ ఎన్నడూ లేని విధంగా రెచ్చిపోయి హీరోతో రొమాన్స్ చెయ్యడం సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఇదంతా పక్కన ఈ సినిమా ద్వారా అనుపమ పరమేశ్వరన్ కి ఉన్న చిరకాల కోరిక తీరిందట.

అదేమిటంటే ఆమెకి ఎప్పటి నుండే ఒక నెగటివ్ క్యారక్టర్ చెయ్యాలని కోరిక ఉండేదట. కానీ ఆమెకి అన్నీ పాజిటివ్ రోల్స్ వచ్చాయి. తెలుగు లో చేసిన మొదటి సినిమా ‘అ..ఆ’ లో నెగటివ్ రోల్ అయ్యినప్పటికీ, అది పూర్తి స్థాయి నెగటివ్ రోల్ కాదు. కానీ ‘టిల్లు స్క్వేర్’ లో మాత్రం ఈమె పోషించిన నెగటివ్ క్యారక్టర్ ని చూసి జనాలు తిట్టుకుంటారట. డీజే టిల్లు సినిమాలో కూడా హీరోయిన్ ని నెగటివ్ రోల్ లో చూపించారు, ఈ సినిమాలో అంతకు మించి ఉంటుందని సమాచారం.
