Siddu Jonnalagadda : ‘డి.జె టిల్లు’ సినిమాతో బాగా పాపులర్ అయ్యాడు సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda). ఆ చిత్రం విడుదలై నెలలు గడుస్తున్నా సోషల్‌మీడియాలో ఈ సినిమాలోని డైలాగులు, పాటలు ఇంకా వైరల్ అవుతూనే ఉన్నాయి. హీరోయిన్స్‌తో కాకుండా డైరెక్టర్స్‌తో రిలేషన్‌షిప్ మెయిన్‌టైన్ చేస్తాని. ప్రస్తుతం ఓ డైరెక్టర్ తో డేటింగ్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. అనుపమతో గొడవ అబద్ధమని చెప్పారు. రూమర్స్ అని కొట్టిపడేశాడు.

ప్రస్తుతం సిద్ధూ ‘డి.జె.టిల్లు’ సినిమా సీక్వెల్‌గా వస్తున్న ‘టిల్లు స్క్వేర్’ (Tillu sqaure) షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. రామ్ మల్లిక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఏదో ఒక రూమర్ బయటకి వస్తూనే ఉంది. హీరో సిద్ధుకి డైరెక్టర్ మరియు హీరోయిన్ల మధ్య విబేధాలు రావడంతో ముందు అనుకున్న డైరెక్టర్ అండ్ హీరోయిన్స్ ఈ ప్రాజెక్ట్ నుంచి వాక్ అవుట్ చేస్తున్నారంటూ వార్తలు వినిపించాయి.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సిద్దూ ఒక ప్రశ్నకు సరదాగా సమాధానం చెప్పాడు. ”నేను హీరోయిన్స్‌తో కాదు డైరెక్టర్స్‌తో రిలేషన్‌షిప్ మెయిన్‌టైన్ చేస్తా. ప్రస్తుతం టిల్లు స్క్వేర్ డైరెక్ట్ చేస్తున్న మల్లిక్ తో రిలేషన్ లో ఉన్నా. మల్లిక్ నాతో పాటు మా ఇంటిలోనే ఉంటున్నాడు, నాతో పాటే తింటున్నాడు. నాతో పాటే పడుకుంటున్నాడు. అతను పడుకుంటే దుప్పటి కూడా కప్పుతున్నా. నాతో కృష్ణ అండ్ హిస్ లీల తెరకెక్కించిన దర్శకుడికి అయితే నేను ముద్దు కూడా పెట్టాను” అంటూ సరదాగా చెప్పి పెద్దగా నవ్వాడు.