Chiranjeevi వరుసగా సినిమాలు చేస్తూ యంగ్ హీరోలను మించి బిజీగా ఉన్నారు. అంతేకాదు మెగా ఫ్యామిలో ఎంతోమంది నటీనటులు ఉన్నా తన పక్కన నటించే అవకాశం కొత్తగా వచ్చిన నటీనటులకే ఇస్తున్నారు. ఈ మధ్యకాలంలో చిరంజీవి నటించిన చాలా చిత్రాల్లో యంగ్ టాలెంట్ను ఎంకరేజ్ చేశారు. కొత్త దర్శకులు, నటీనటులతో సినిమాలు చేస్తూ టాటెంట్‌కే పెద్దపీట వేస్తున్నారు. త్వరలో చేయబోయే రెండు సినిమాలకూ యంగ్ డైరెక్టర్స్ నే ఎంపిక చేశారు మెగాస్టార్. బింబిసార లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన వశిష్ట, బంగార్రాజు మూవీతో హిట్ కొట్టిన కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్ లో చిరంజీవి సినిమాలు రాబోతున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి నటించనున్న కొత్త సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ నటించే ఛాన్స్ అందుకున్నాడని వార్తలు వచ్చాయి. ‘బంగార్రాజు’ ఫేమ్ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ‘బంగార్రాజు’ లాంటి హిట్ చిత్రం తర్వాత ఈ సినిమా తెరకెక్కనుండటం, అందులోనూ మెగాస్టార్ కూడా ఈ సినిమాలో రోల్ చేస్తుండటం వల్ల.. ఈ చిత్రంపై అభిమానుల్లో మంచి అంచనాలే నెలకొన్నాయి. ఈ మూవీలో చిరు కొడుకు పాత్రలో సిద్ధు నటించనున్నాడని అంతా అన్నారు కూడా. అంతే కాకుండా ఈ సినిమాలో నటించేందకు సిద్ధు ఏకంగా రూ.4 కోట్ల రెమ్యునరేషన్ కూడా అందుకోబోతున్నాడన్న ప్రచారం కూడా జోరుగా సాగింది.

అయితే ఇప్పుడు మరో షాకింగ్ వార్త తెరపైకి వచ్చింది. సిద్ధు.. ఈ పాత్రలో చేయడానికి సుముఖంగా లేడని తెలిసింది. సెకండ్ లీడ్ రోల్స్ వద్దనుకున్నాడట. మెయిన్ లీడ్ రోల్స్ చేయాలని అనుకుని ఈ నిర్ణయం తీసుకున్నాడని సమాచారం. దీంతో దర్శకుడు కల్యాణ్ కృష్ణ.. సిద్ధు స్థానాన్ని భర్తీ చేసేందుకు మరో హీరో కోసం వెతికే పనిలో పడ్డారని తెలిసింది. ఈ క్రమంలో పలువురు హీరోల పేర్లను పరిశీలిస్తున్నారట్లు టాక్ కూడా నడుస్తోంది. చూడాలి మరి సిద్ధు స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారో, ఏ హీరో నటిస్తారో.