Shruti Haasan : ఈ ఏడాది స్టార్ హీరోయిన్ శృతి హాసన్ కి మామూలు రేంజ్ లో కలిసిరాలేదు అనే చెప్పాలి. ఆమె ముట్టుకున్న ప్రతీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఒకప్పుడు ఐరన్ లెగ్ అని ముద్ర వేసుకున్న శృతి హాసన్ ఇప్పుడు నిర్మాతల పాలిట గోల్డెన్ లెగ్ గా మారింది. ఏడాది ప్రారంభం లో సంక్రాంతి కానుకగా విడుదలైన ‘వాల్తేరు వీరయ్య’ మరియు ‘వీర సింహా రెడ్డి’ చిత్రాలతో రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకుంది.
వీటిల్లో ‘వాల్తేరు వీరయ్య’ చిత్రానికి 200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు రాగ, వీర సింహా రెడ్డి చిత్రానికి 130 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అలా ఒకే సమయం లో విడుదలైన రెండు సినిమాలకు కలిపి 330 కోట్ల రూపాయిల గ్రాస్ ని శృతి హాసన్ తన ఖాతాలో వేసుకుంది.
ఈ నెల ప్రారంభం లో న్యాచురల్ స్టార్ నాని హీరో గా నటించిన ‘హాయ్ నాన్న’ చిత్రం లో కీలక పాత్ర పోషించి, ఆ సినిమా విజయంలో కూడా పాలుపంచుకుంది శృతి హాసన్. ఈ చిత్రానికి దాదాపుగా 60 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక రీసెంట్ గా విడుదలైన ‘సలార్’ చిత్రం 600 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉన్నందున, ఈ ఏడాది శృతి హాసన్ చేసిన సినిమాలు వెయ్యి కోట్ల రూపాయిల బిజినెస్ ని బాక్స్ ఆఫీస్ వద్ద చేసినట్టు అయ్యింది.
ఇలాంటి రికార్డు సౌత్ లో ఇప్పటి వరకు ఏ స్టార్ హీరోయిన్ ఖాతాలో కూడా లేదు. గత రెండు మూడేళ్ళ నుండి శృతి హాసన్ పట్టిందల్లా బంగారం లాగ మారుతూ వస్తుంది. ఆమె గోల్డెన్ లెగ్ ప్రభావం ఉన్నప్పుడే తమ సినిమాలో హీరోయిన్ గా బుక్ చేసుకునేందుకు ఎగబడుతున్నారు మేకర్స్.