సౌత్ బ్యూటీ శ్రుతి హాసన్ కేవలం తమిళంలోనే కాకుండా తెలుగు, హిందీ భాషల్లోనూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. ఇక తెలుగులో ఆమె చేసిన పలు సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్స్‌గా నిలవడంతో, ఇక్కడ ఆమె స్టార్ హీరోయిన్ స్థాయిని కూడా అందుకుంది. అయితే తన బాయ్ ఫ్రెండ్‌తో బ్రేకప్ కారణంగా కొంత కాలం సినిమాలకు దూరమైన ఈ బ్యూటీ, ఇప్పుడు తిరిగి సినిమాల్లో యమబిజీగా మారింది.
కాగా గబ్బర్ సింగ్ సినిమాతో ఫస్ట్ హిట్ తన ఖాతాలో వేసుకున్న శృతిహాసన్ ఆ తర్వాత తనదైన స్టైల్ లో గుర్తింపు సంపాదించుకుంది . రీసెంట్ గానే వీర సింహారెడ్డి -వాల్తేరు వీరయ్య అంటూ బ్యాక్ టు బ్యాక్ రెండు బడా హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న శృతిహాసన్ .. రీసెంట్గా కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొంది . ఈ క్రమంలోనే అమ్మడు డైస్ పై మాట్లాడుతూ నేటి తరం హీరోయిన్స్ పై సంచలన కామెంట్స్ చేసింది.
నిజాయితీగా చెప్పాలంటే ఇది అన్ని చోట్లా ఉంటుంది. మనమంతా లింగ సమానత్వం గురించి ఎన్నో కలలు కన్నాం. మహిళల భద్రత, బాలికలకు విద్య, పరిశుభ్రత, మంచి ఆరోగ్యం ఇలాంటి ఎన్నో అంశాలు పరిష్కరించాల్సి ఉంది. వినోద రంగానికి సంబంధించినంత వరకు ఎన్నో విషయాల్లో మార్పు ఇప్పుడిప్పుడే మొదలైంది. నెమ్మదిగా ప్రారంభమైనప్పటికీ అది కచ్చితంగా కొనసాగుతుంది. నేను కూడా కొన్నిసార్లు తక్కువ పారితోషికం తీసుకున్న సందర్భాలున్నాయి. కానీ నేనేప్పుడు ఈ విషయంలో బాధపడలేదు. ఎందుకంటే నాకు కావలసినంత పని ఉంది. అందులోనే నాకు ఆనందం ఉంటుంది. ఇక రెమ్యూనరేషన్ విషయంలో నటీమణులంతా కలిసికట్టుగా ఉండాలి.