Shriya Saran : ఇష్టం సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టి ఎంతోమందికి ఇష్టసఖిగా మారిపోయింది నటి శ్రియ. తెలుగు తెరతో పాటు సౌత్ ఇండియా తెరలన్నింటినీ తన అందాలతో ఓ ఊపు ఊపేసిన శ్రియ.. టాలీవుడ్ సీనియర్ మరియు యంగ్ స్టార్ హీరోలందరితో రొమాన్స్ చేసి సూపర్ డూపర్ హిట్స్ ఖాతాలో వేసుకుంది.కరోనా సమయంలో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా వాళ్ల బేబి ఫొటోలను కూడా పంచుకుంది. అయితే ఇప్పుడు శ్రియ చేసిన ఓపని అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

ఆఫర్ల కోసం తాను ఎంత ఫిట్ గా ఉన్నానో చూపించాలనుకుంది శ్రియ అందుకే ప్రెగ్నెసీ అప్పటి ఫొటోను తాజాగా దిగిన హాట్ ఫొటోను కలిపి పోస్ట్ చేసింది. ఇది చూసి వామ్మో ఏం మాస్టర్ ప్లాన్ అనుకుంటున్నారంతా. గర్భవతిగా ఉన్న ఫోటోతో పాటు ఇపుడెలా ఉన్నది తెలియజేస్తూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలను షేర్ చేయడంపై అభిమానులు వివిధ రకాలుగా ప్రస్తావిస్తున్నారుసోషల్ మీడియాలో వేదికగా మాత్రం అభిమానులతో టచ్‌లో ఉంటూ నెట్టింట మంట పుట్టించే రొమాంటిక్ అప్‌డేట్స్ షేర్ చేస్తోంది. సోషల్‌మీడియాలో గ్లామర్ షోతో పాటు పలు ఆసక్తికర విషయాలు కూడా పంచుకుంటుంది శ్రియ.

సినిమాల విషయానికొస్తే.. శ్రియ గతేడాది .. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన ఈ చిత్రంలో రామ్ చరణ్ తల్లి పాత్రలో మెరిసింది. ఈ సినిమాలో అజయ్ దేవ్‌గణ్ భార్య పాత్రలో నటించింది. ఆ తర్వాత దృశ్యం2లో మరోసారి అజయ్ సరసన మెరిసింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్ అందుకుంది. అటు నానా పాటేకర్‌తో కలిసి ‘తడ్కా’ సినిమాలో మెరిసింది.