Shriya Saran సినీ ప్రియులకు ఈ పేరు పరిచయం అవసరం లేదు. తెలుగు, తమిళం, హిందీతోపాటు కన్నడ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్‌గా మారిపోయింది. స్టార్ హీరోయిన్ క్రేజ్ సంపాదించుకున్న తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఇంట్రెస్టింగ్ రోల్స్ చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది. తాజాగా ఈ క్రేజీ హీరోయిన్ కోరిన రెమ్యునరేషన్ కు డైరెక్టర్ షాక్ తిన్నారని అంటున్నారు ఫిల్మ్ నగర్ వాసులు.

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న భోళా శంకర్ (Bhola Shankar )లో ఐటెం సాంగ్ (Item Song)కోసం శ్రియాను సంప్రదించినట్టు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అంతేకాదు ఈ పాట కోసం ఏకంగా కోటి రూపాయలు రెమ్యునరేషన్ అడిగిందన్న టాక్ కూడా జోరుగా నడుస్తోంది. ఇటీవలే కన్నడ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కబ్జ సినిమాలో కూడా ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటించి అందరినీ మెప్పించింది ఈ ఘాటు సుందరి. దీంతో తనకు ఎదురులేదనుకుందని అనుకుంటున్నారు.

ఇదే నిజమైతే శ్రియా శరణ్ క్రేజ్ మరింత పెరిగి ఐకానిక్ స్టార్‌గా మారిపోవడం ఖాయమైనట్టేనంటున్నారు ట్రేడ్ పండితులు. దీనిపై రాబోయే రోజుల్లో చిరంజీవి టీం ఏదైనా క్లారిటీ ఇస్తుందేమో చూడాలంటున్నారు సినీ జనాలు. అసలు చిరంజీవి సినిమాలో ఛాన్స్ కోసం అందరూ ఎదురుచూస్తుంటారు. కానీ శ్రియ మాత్రం అవకాశాన్ని క్యాష్ చేసుకోవాలని భావిస్తోంది. ఏదేమైనా శ్రియ తెలివికి కొందరు ఆశ్చర్యపోతున్నారు. ఇక మలయాళం సినిమా వేదాళమ్ రీమేక్‌గా వస్తున్న భోళా శంకర్ తమన్నా భాటియా ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తుండగా.. చిరు సోదరి పాత్రలో కీర్తిసురేశ్ నటిస్తోంది. ఆగస్టు 11న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది .