Shraddha Kapoor : రెడ్ శారీలో శ్రద్ధా రావిషింగ్ లుక్స్

- Advertisement -

శ్రద్ధా కపూర్.. ఈ బాలీవుడ్ బ్యూటీ టాలీవుడ్ కు కూడా పరిచయమే. ఆషికీ-2 సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ తో టాలీవుడ్ ప్రేక్షకులకు ఈ భామ పరిచయమైంది. ఆ సినిమాలో ఈ బ్యూటీ యాక్టింగ్ కు తెలుగు కుర్రాళ్లు ఫిదా అయిపోయారు. ఇక అప్పటి నుంచి భాష అర్థమైనా కాకపోయినా.. శ్రద్ధా సినిమాలు చూడటం షురూ చేశారు. ఇక తెలుగు ఫ్యాన్స్ కోసమే అన్నట్టు.. శ్రద్ధ ఏకంగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది.

Shraddha Kapoor turns heads for 'Stree 2' promotions in Nitya Bajaj's  Ajrakh saree worth Rs. 48k | Fashion News - News9live

 

- Advertisement -

సాదాసీదా ఎంట్రీ కాదు అది. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ డమ్ సొంతం చేసుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ తో జతకట్టింది శ్రద్ధా. అలా ఈ జంట సాహో సినిమాలో కలిసి నటించారు. ఈ చిత్రం ద్వారా శ్రద్ధ టాలీవుడ్ లో అఫీషియల్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో సినిమాలు చేయకపోయినా.. ఈ భామపై తెలుగు కుర్రాళ్లు మాత్రం ప్రేమను పెంచేసుకున్నారు.

Shraddha Kapoor and Rahul Mody have broken up? Stree 2 actress unfollows  rumoured beau

 

ఇక సోషల్ మీడియాలో శ్రద్ధాను ఫాలో అవడం మొదలు పెట్టారు. నెట్టింట ఈ భామ రియలిస్టిక్ గా ఉండటం చూసి ఈ బ్యూటీ అందానికే కాదు.. మనసుకు ఫిదా అయిపోయారు. అలా శ్రద్ధా తరచూ తన అప్డేట్స్ తో ఫ్యాన్స్ ను ఖుష్ చేస్తూ ఉంటోంది. ఈ క్రమంలోనే తన లేటెస్ట్ మూవీ స్త్రీ-2 ప్రమోషన్స్ కు సంబంధించిన అప్డేట్స్ కూడా షేర్ చేస్తోంది.

 

తాజాగా స్త్రీ-2 మూవీ ప్రమోషన్స్ కోసం శ్రద్ధా దాదాపుగా రెడ్ కలర్ ఔట్ ఫిట్స్ నే సెలెక్ట్ చేసుకుంటుంది. ఈ క్రమంలోనే ఈ భామ తాజాగా రెడ్ శారీలో సందడి చేసింది. రెడ్ కలర్ చీరలో శ్రద్ధా బ్యూటీఫుల్ గా కనిపించింది. ముక్కుపుడకతో కళ్లకు కాటుకతో ఓర చూపులతో.. వర్ణించలేనంత అందంగా తయారైంది. ఈ ఫొటోలను నెట్టింట షేర్ చేసింది. ఇక కుర్రాళ్ల గుండె ఝళ్లుమందనుకోండి ఈ అమ్మడుని ఇంత అందమైన ఔట్ ఫిట్ లో చూసిన తర్వాత.

 

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here