Jabardasth Varsha : ఇటీవల కాలంలో టీవీ షో కానీ.. ఒక పోగ్రామ్ కానీ హిట్ కొట్టాలంటే ఎక్కవగా ఓ ట్రిక్ ఉపయోగిస్తున్నారు. అదే సెలబ్రిటీల మధ్య లవ్ ట్రాక్.. స్టేజీలపై వాళ్లిచ్చే పర్ఫామెన్స్ చూస్తే వాళ్లు నిజంగా లవ్ లో ఉన్నారేమో అన్న భావన చాలామందికి కలుగుతుంది. ఇక బుల్లితెరపై ఫుల్ పాపులర్ అయన జంటల్లో ముందుగా చెప్పుకునేది సుడిగాలి సుధీర్ అండ్ రష్మి గౌతమ్ జంట. వీరి తర్వాత అంతా ఫేమస్ అయింది మాత్రం జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, వర్ష. వీళ్లద్దరూ ప్రేమలో ఉన్నట్లు ఇప్పటివరకు అనేక షోలలో బహిరంగంగానే చెప్పుకున్నారు. అది అబద్ధమో, నిజమో ఇప్పటికీ ఎవరికీ అర్థం కాదు.
జబర్ధస్త్ వేదికగా ఒక్కటైంది ఈ జంట. ప్రజెంట్ ఇద్దరూ సక్సెస్‌పుల్‌గా కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం వర్ష వరుస షోల తో బిజీగా ఉంది. ఇమ్మాన్యూయేల్- వర్ష కలిసి మనసంతా నువ్వే అనే షోకు హోస్టులుగా చేస్తున్నారు. తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. మనసంతా నువ్వే షో థీమ్ ఏంటంటే.. కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ ను పిలిచి.. వారితో సరదాగా ఆటలు ఆడించడం. అంతేకాకుండా ఒరిజినల్ గా విడిపోయిన జంటలు ఉంటే.. వారి కథలను స్కిట్ రూపంలో చేసి చూపిస్తారు. ఇక ఈ ప్రోమోలో వర్షను ఇమ్మాన్యుయేల్ ఓ ఆట ఆడేసుకున్నాడు. మనసంతా నువ్వే షో రెండు ఎపిసోడ్స్ రిలీజ్ అయ్యాయి కదా.. నీకు ఎవరైనా ఫోన్ చేసి ఏమైనా అన్నారా అని ఇమ్మాన్యుయేల్ అడగ్గా .. మీ షో సూపర్ అన్నారంటూ వర్ష చెప్పుకొచ్చింది. మరి నీకు ఫోన్ చేసి ఏం చెప్పారు అని వర్ష అడగ్గా.. ఫ్రీ షో ఆపేయమన్నారంటూ ఇమ్ము రిప్లై ఇస్తాడు.
నేను చూపించింది చిన్న నడుమే కదా అని వర్ష అంటే.. నువ్వు నడుము చూపించడం లేదమ్మా.. బట్టలు ఇంత చిన్నగా చేసి చూపిస్తున్నావు అంటూ తనపై సెటైర్ వేశాడు. ఇక ఈ షోలో వర్ష ఎమోషనల్ అయ్యింది. స్కిట్ లో భాగంగా ఒక జంట ప్రేమ కథను చూపించారు. అందులో అబ్బాయి.. అమ్మాయిని అనుమానిస్తాడు. ఆ అనుమానంతోనే వాటి లవ్ బ్రేకప్ అయిందని చెప్పారు. ఇక స్కిట్ తరువాత వర్ష మాట్లాడుతూ.. ఒక అమ్మాయి మీద తెలిసి తెలియనట్లు ఊరికే మాట అనేస్తారు.. ఆడవాళ్లంటే అంత లోకువా.. ఎక్కడపడితే అక్కడ ఏది పడితే అది మాట్లాడేస్తారంటూ స్టేజీ పైనే ఏడ్చింది. ఈ ప్రోమో నెట్టింట్లో వైరల్ అవుతోంది.