Tamanna Bhatia : ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో వారసుల హవా కొనసాగుతోంది. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా తన స్థాయిని పెంచుకుంటున్నాడు. ఇక రామ్ చరణ్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన చిరుత సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ఇక ఆరెంజ్ సినిమా ఫ్లాప్ అవ్వడంతో సంపత్ నంది దర్శకత్వంలో రచ్చ సినిమా చేశాడు. అప్పట్లో ఈ సినిమా మామూలుగా రచ్చ చేయలేదు. ఈ సినిమాలో 1991లో గ్యాంగ్ లీడర్ లో చిరంజీవి, విజయశాంతి చేసిన పాట వాన వాన విల్లువాయే అనే సాంగ్ ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఇక ఆ సినిమాలోని సాంగ్ ను రచ్చ మూవీలో తీసుకోవడం విశేషం. రచ్చ మూవీలో ఈ సాంగ్‌లో చరణ్, తమన్నా నటించారు. అయితే ఈ సాంగ్ షూటింగ్‌కోసం వేసిన సెట్ లో తమన్నా రామ్ చరణ్ తో కాకుండా.. విడిగా ప్రాక్టీస్ చేసిందట..

అయితే రాంచరణ్ తో చేయకుండా రిహార్సల్ తానే విడిగా చేసుకోవడం పై అప్పట్లో చాలా రూమర్స్ వచ్చాయి. అయితే దీనికి రామ్ చరణ్ అస్సలు పట్టించుకోలేదు. అయితే మళ్లీ ఈవిషయం పై తమన్నా.. రామ్ చరణ్ ను డామినేట్ చేస్తుంది అనే మాటలు వినగానే.. దానికి అసలు విషయాన్ని బయటపెట్టాల్సి వచ్చింది తమన్నా. నేను వేరేగా రిహార్సల్ చేయడానికి కారణం రామ్ చరణ్.. మెగాస్టార్ చిరంజీవి తనయుడు కాబట్టి.. అందుకే దూరంగా ఉన్నా అంతేకానీ.. రామ్ చరణ్‌ను డామినేట్ చేసేంత లేదని చెప్పిందట.. ఆ తరువాత రామ్ తో క్లోజ్ ఉంటూ షూటింగ్ పూర్తి చేసిందట ఈ మిల్కీ బ్యూటీ ఏదేమైనా రచ్చ మూవీ లో ఇద్దరూ కలిసి మామూలుగా రచ్చలేదు.. రచ్చ చేయడమే కాకుండా.. అందరి ప్రేక్షకులను మిల్కీ బ్యూటీ ఈసినిమాతో తనవైపు మళ్లించుకుంది అంటే తమన్నా రచ్చ మామూలుగా చేయలేదని మనం అర్థం చేసుకోవచ్చు.