Vishwak Sen : ఆటిట్యూడ్ తగ్గించుకోకపోతే కష్టమే.. విశ్వక్ పై శోభు యార్లగడ్డ స్టేట్మెంట్ వైరల్…

- Advertisement -

Vishwak Sen : బాహుబలి నిర్మాత అయిన శోభు యార్లగడ్డ తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేసుకున్న ఒక ట్వీట్ ప్రస్తుతం కొత్త వివాదానికి తెరలేపింది. శోభు యార్లగడ్డ రాసిన హార్ట్ విత్ టాలీవుడ్ ఆటిట్యూడ్ హీరో విశ్వక్ సేన్ గురించి అని నెటిజన్స్ మధ్య పెద్ద చర్చ నడుస్తుంది. రీసెంట్ గా విడుదలై సంచలనం సృష్టించిన బేబీ చిత్రం డైరెక్టర్ సాయి రాజేష్.. మూవీ సక్సెస్ మీట్ లో ఒక హీరో తన స్టోరీ వినకుండానే రిజెక్ట్ చేశాడు అని చెప్పిన మాట ఓరేంజ్ సంచలనాన్ని సృష్టించింది.

Vishwak Sen
Vishwak Sen

తాను ఒక హీరోకి స్టోరీ చెప్పడానికి వెళ్ళినప్పుడు అతను కనీసం స్టోరీ వినడానికి కూడా ఇష్టపడలేదని చెప్పారు. అంతే కాకుండా ఆ డైరెక్టర్ తో స్క్రిప్ట్ చేయడం వేస్ట్ అని తనని కలవడానికి కూడా ఆ సదరు హీరో ఇంట్రెస్ట్ చూపించలేదని అని సాయి రాజేష్ పేర్కొన్నారు. ఈ విషయం జరిగిన వెంటనే విశ్వక్ సేన్ నో మీన్స్ నో… ఇది మగవాళ్లకు కూడా వర్తిస్తుంది గొడవ చేయకుండా గమ్మున ఉండండి…అంటూ పెట్టిన ట్వీట్…సాయి రాజేష్ చెప్పిన ఆ సదరు హీరో అతని అన్న అనుమానాన్ని రేకెత్తింది.

సాయి రాజేష్ మాటలకు విశ్వక్ సేన్ ఇచ్చిన కౌంటర్ ఆ ట్వీట్ అని అందరూ అభిప్రాయపడ్డా. అయితే విశ్వక్ ట్వీట్స్ కు ఏ మాత్రం తగ్గకుండా సాయిరాజేష్ కూడా ఓ రేంజ్ కౌంటర్స్ ఇవ్వడం జరిగింది. అక్కడి వరకు కథ బాగానే ఉంది కానీ మధ్యలో సడన్ గా ఎటువంటి సంబంధం లేకుండా సీన్లోకి శోభు యార్లగడ్డ ఎందుకు వచ్చారు అనేది ఎవరికీ అర్థం కావడం లేదు.‘ఇప్పుడే ఎదుగుతున్న హీరో తన యాటిట్యూడ్ తో ఒక హిట్ కొట్టాడు. సక్సెస్ తలపొగరు తెస్తుంది. కానీ దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఒక దర్శకుడు స్క్రిప్ట్ చెబుతానంటే కనీసం వినకుండా అవమానించడం ఎంత వరకు కరెక్ట్. కెరీర్లో ఎదగాలంటే ఇలాంటి యాటిట్యూడ్ వదులుకోవాలి. అది ఎప్పుడు తెలుసుకుంటాడో’ అని శోభు యార్లగడ్డ పెట్టిన టివి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

- Advertisement -

శోభు యార్లగడ్డ మాట్లాడిన ఆటిట్యూడ్ హీరో మరెవరో కాదు విశ్వక్ అని విశ్వసనీయంగా అందరూ నమ్ముతున్నారు. ఈ విషయం గురించి హార్ట్ డిబేట్ జరుగుతున్న సమయంలో అనూహ్యంగా సోబుయార్లగడ్డ ఆ ట్వీట్ ను డిలీట్ చేయడమే కాకుండా అది విశ్వకులు ఉద్దేశించింది కాదు అని కామెంట్ కూడా పెట్టాడు. వివాదాలకు ఎప్పుడూ ఆమడ దూరంలో ఉండే శోభు యార్లగడ్డ సడన్గా ఒక చిన్న హీరోకి డైరెక్టర్ కి మధ్యలో తలెత్తిన వివాదంలోకి ఎందుకు తల దూర్చాడా అనేది ఎవరికీ అర్థం కాలేదు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here