shivani rajashekar : ప్రముఖ దర్శకుడు పా.రంజిత్ ఆయన సినిమాల్లో ఏదొక ప్రత్యేకత ఉంటుంది. దాంతో సినిమాలు ఒక ప్రత్యేకతను పొందుతాయి. అలా ఆయన మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.. సమాజంలోని అసమానతలను ప్రశ్నిస్తూనే కమర్షియల్ అంశాలు యాడ్ చేస్తూ చిత్రాలు రూపొందించడంలో ఆయనను మించినవారు ఉండరు. ఒకవైపు డైరెక్టర్ గా వరుస సినిమాలు చేస్తూ.. మరోవైపు నీలం పేరుతో ఒక ప్రొడక్షన్ ను స్టార్ట్ చేశారు.

అంతేకాదు తన శిష్యులకు దర్శకత్వం వహించే అవకాశాన్ని కల్పిస్తూ వైవిధ్యమైన కథాచిత్రాలను నిర్మిస్తున్నా రు. గతంలో దర్శకుడు మారి సెల్వరాజ్ వంటి సక్సెస్ పుల్ దర్శకులను పరిచయం చేశారు. ఇదిలా ఉండగా ఇప్పుడు మరో డైరెక్టర్ ను పరిచయం చేశారు. అకిరన్ మోసెస్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ నూతన చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం గురువారం చైన్నెలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

ఇందులో అతనికి జంటగా టాలీవుడ్ హీరోయిన్ శివానీ రాజశేఖర్ నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో శ్రీనాథ్ బాజీ, లింగేష్, విశ్వంత్ వంటి వరుకు నటిస్తున్నారు. రంజిత్ నిర్మిస్తున్న సినిమా అంటే అంచనాలు వేరే లెవల్ లో ఉంటాయి.. అలాగే ఆయన రూపొందిస్తున్న చిత్రంలో జీవీ ప్రకాష్ కుమార్ కథానాయకుడిగా నటించడం మరో విశేషం. వీరి కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇదంతా పక్కన పెడితే.. కొందరు నెటిజన్లు మాత్రం స్టార్ కూతురు అయి ఉండి ఇలాంటి హీరోకు ఒకే చెప్పడమేంటి.. అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.