Bigg Boss Telugu : ఈ వారం మొత్తం ఫ్యామిలీ వీక్ అయిపోయింది, బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ టాస్కులు లేవేమో, చాలా చప్పగా వెళ్ళిపోతుంది అని అనుకున్నారు. కానీ నిన్న జరిగిన కెప్టెన్సీ టాస్కు హౌస్ లో మరోసారి హీట్ వాతావరణం ని తీసుకొచ్చింది. ఇన్ని వారాలు చెయ్యి దెబ్బ తగలడం కారణంగా టాస్కులు ఆడలేకపోయిన శివాజీ, ఇప్పుడు చెయ్యి సెట్ అవ్వడం తో తన విశ్వరూపం చూపించేసాడు.

నిన్న బొమ్మలను పట్టుకొని ఆయన పరిగెత్తిన తీరు శబాష్ అనిపించింది. కుర్రోళ్ళు గౌతమ్ మరియు అర్జున్ కూడా శివాజీ దాటికి నిలబడలేకపోయారు, ఆయన మైండ్ గేమ్ ని క్రాక్ చేయలేకపోయారు. చివరికి ఇంటికి కెప్టెన్ అయ్యి తన సత్తాని చాటాడు. ఆయన కెప్టెన్సీ ఈ వారం ఎలా ఉంటుందో చూడాలని అందరూ ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇదంతా పక్కన పెడితే శివాజీ మైండ్ గేమ్ నిన్న అద్భుతం అనే చెప్పాలి.

అర్జున్ మరియు గౌతమ్ ఒకరి బొమ్మలను ఒకరు మార్చుకొని ఎవరో ఒకరు ఇంటి కెప్టెన్ అవుదాం అనుకున్నారు. కానీ శివాజీ వాళ్ళిద్దరి ప్లాన్ ని భగ్నం చేసాడు. పరిగెత్తుకుంటూ వెళ్లి గౌతమ్ బొమ్మని తీసుకొని అక్కడే ఆగిపోయాడు. దెబ్బకి అర్జున్ మరియు గౌతమ్ కి మైండ్ బ్లాక్ అయ్యినంత పని అయ్యింది. ఇక చేసేది ఏమి లేక గౌతమ్ మరియు అర్జున్ లోపలకి వెళ్లిపోయారు, శివాజీ గౌతమ్ బొమ్మని పట్టుకొని అలా నిల్చిపోయాడు. చివరికి గౌతమ్ అవుట్ అయిపోయాడు.

ఆ తర్వాత గౌతమ్ కి శివాజీ కి పెద్ద గొడవ జరిగింది, ఇందులో కూడా శివాజీ తప్పు ఏమి లేదని తెలిసిపోయింది. అలా చివరికి అర్జున్ మరియు శివాజీ మధ్య పోరు జరగగా శివాజీ గెలిచి ఇది కెప్టెన్ అయ్యాడు. ఆయన ఇంటి కెప్టెన్ అవ్వడం తో ఆయన అభిమానులు సోషల్ మీడియా లో సంబరాలు చేసుకున్నారు. ఏది ఏమైనా 50 ఏళ్ళ వయస్సు లో శివాజీ ఆడిన తీరు శబాష్ అనిపించింది.