Bigg Boss Shivaji : బిగ్ బాస్ రియాలిటీ షో ఎంత మంది సెలెబ్రిటీల జీవితాలను మార్చిందో మనకి తెలియదు కానీ, శివాజీ కెరీర్ ని మాత్రం ఎవ్వరూ ఊహించని రీతిలో మలుపు తిప్పింది అని చెప్పొచ్చు. సినిమాల ద్వారా ఇప్పటి వరకు ఆయన ఎంత ఫ్యాన్ బేస్ ని సంపాదించాడో తెలియదు కానీ, బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతీ గడపకి ఒక అభిమానిని సంపాదించాడు.
సరిగ్గా శివాజీ అలాంటి క్రేజ్ ని ఎంజాయ్ చేస్తున్న సమయం లో ఇప్పుడు ఆయన కెరీర్ కి మరో బూస్ట్ ని ఇచ్చే వెబ్ సిరీస్ ఈటీవీ విన్ యాప్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ’90s’ అనే పేరు తో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ శివాజీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లకముందే తెరకెక్కింది. కానీ బిగ్ బాస్ ద్వారా రోజు రోజుకి శివాజీ సంపాదించుకున్న క్రేజ్ ని చూస్తూ వచ్చిన ఈటీవీ యాజమాన్యం, ఆయన బయటకి వచ్చిన తర్వాతనే స్ట్రీమింగ్ చెయ్యాలని డిసైడ్ అయ్యింది.
అలా రీసెంట్ గానే స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇకపోతే ఈ సిరీస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శివాజీ మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ ‘బిగ్ బాస్ కి ముందు నేను విజయ్ సేతుపతి గారి సినిమా ఒకటి కొన్నాను. డబ్బింగ్, మ్యూజిక్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అన్నీ అయిపోయాయి. సరిగ్గా ఆ సమయం లోనే కరోనా మూడవ వేవ్ వచ్చింది. ఇలాంటి సమయం లో ఆ చిత్రాన్ని విడుదల చేసి నష్టపోవడం ఇష్టం లేక నాకు ఉన్న సర్కిల్ ద్వారా ఈటీవీ బాపినీడు గారిని కలిసాను. అతనికి ఇలా నేను రెండు సినిమాలు కొన్నాను, పెట్టుబడి భారీ గా పెట్టేసాను, ఇది అమ్ముడుపోకపోతే నాకు ఆత్మహత్యనే గతి, ఒక్కసారి మీరు ఈ రెండు సినిమాలను చూసి మీ ఓటీటీ లో అప్లోడ్ చేసుకోవచ్చేమో చూడండి అని చెప్పాను, ఆయన దానికి ఒప్పుకున్నాడు, ఆ తర్వాత నన్ను నువ్వు యాక్టింగ్ మొదలు పెట్టాలి అయ్యా శివాజీ అని అన్నాడు, కచ్చితంగా నేను చేస్తాను అని చెప్పాను, ఆ తర్వాత నెల రోజులకు నాకు కాల్ వచ్చింది. ఈ స్క్రిప్ట్ ని వినిపించారు, నాకు చాలా బాగా నచ్చి వెంటనే ఓకే చెప్పేసాను’ అంటూ చెప్పుకొచ్చాడు శివాజీ.