Shivaji : బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం అత్యధిక ఓట్లతో నెంబర్ 1 స్థానం లో కొనసాగుతున్న కంటెస్టెంట్ ఎవరు అంటే, టక్కుమని మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు శివాజీ. తన మైండ్ గేమ్ తో, అద్భుతమైన మాటకారి తత్త్వం తో హౌస్ లో అందరినీ డామినేట్ చేస్తూ ముందుకు పోతున్నాడు. ఇన్ని రోజులు బయట మనం ఎలాంటి శివాజీ ని అయితే చూసామో, బిగ్ బాస్ హౌస్ లోపల కూడా అలాంటి శివాజీనే చూస్తున్నాము. మనసుకి అనిపించింది, అనిపించినట్టు మాట్లాడుతాడు.

కానీ తప్పు చేసినా కూడా ఒప్పు చేసినట్టు, సరదాగా మాట్లాడినట్టు , తనకి పూర్తిగా అనుకూలంగా మార్చేసుకుంటాడు. అందుకే ఆయనకీ ఒక్క పక్క సోషల్ మీడియా నుండి ఎంత సపోర్ట్ ఉందో, అదే రేంజ్ నెగటివిటీ కూడా ఉంది. ఇదంతా పక్కన పెడితే గతం లో ఆయన పవన్ కళ్యాణ్ మరియు చిరంజీవి గురించి చేసిన కొన్ని కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి.

యాంకర్ శివాజీ ని ఒక ప్రశ్న అడుగుతూ ‘మీరు కాఫీ లండన్ లో తాగుతారట, లంచ్ అమెరికా లో చేస్తారట, డిన్నర్ సమయానికి సింగపూర్ లో ఉంటారట?, మీరేమైనా చిరంజీవి అనుకుంటున్నారా లేదా పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారా?’ అని అడుగుతాడు.

దానికి కోపం తెచ్చుకున్న శివాజీ ‘చిరంజీవి, పవన్ కళ్యాణ్ కి ప్రత్యేకంగా ఏమైనా పైన నుండి కొమ్ములు మొలిచాయా?, లేదా డబ్బులు చెట్టు ఏమైనా వాళ్ళ నెత్తి మీద మొలుస్తుందా?, ఏమి మాట్లాడుతున్నావ్ అసలు?, నేను 15 ఏళ్ళ క్రితం మీరా జాస్మిన్ తో విదేశాల్లో షూటింగ్స్ చేశాను. అక్కడ ఎంతో లగ్జరీ లైఫ్ అని అనుభవించాను, నేనేమి దీనమైన స్థితిలో లేను’ అంటూ చాలా కోపం గా చెప్పుకొచ్చాడు. ఈ వీడియో పై సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ అభిమానులు విరుచుకుపడుతున్నారు. నోటికి ఏది పడితే అది మాట్లాడడం కరెక్ట్ కాదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
