Shivaji : బిగ్ బాస్ లో ఒక్కో ఎపిసోడ్ కి శివాజీ కి ఎంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారో తెలిస్తే నోరెళ్లబెడుతారు!

- Advertisement -

Shivaji : హీరో గా, క్యారక్టర్ ఆర్టిస్టుగా శివాజీ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. హీరో గా ఎన్నో సూపర్ హిట్స్ ని అందుకున్న శివాజీ , క్యారక్టర్ ఆర్టిస్టుగా కూడా గొప్పగా రాణించాడు. కెరీర్ సాఫీగా సాగిపోతున్న సమయం లో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టి కెరీర్ కి బాగా నష్టం చేసుకున్నాడు.

Shivaji
Shivaji

మళ్ళీ రాజకీయాల నుండి తప్పుకున్న శివాజీ సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తుండగా, ఆయనకీ బిగ్ బాస్ సీజన్ 7 లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొనే అద్భుతమైన గోల్డెన్ ఛాన్స్ దక్కింది. సినిమా ద్వారా ఆయన సంపాదించిన మంచి పేరు కంటే, బిగ్ బాస్ షో ద్వారా ప్రస్తుతం ఆయన సంపాదించుకున్న పేరు ఎంతో గొప్పది. తన అద్భుతమైన మైండ్ గేమ్ తో టాస్కులు ఆడుతూ, నీతి నిజాయితితో ఆడుతున్న ఏకైక కంటెస్టెంట్ గా శివాజీ తన మార్కుని క్రియేట్ చేసుకున్నాడు.

Actor Shivaji

ఇదంతా పక్కన పెడితే శివాజీ కి బిగ్ బాస్ టీం ఇస్తున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు సోషల్ మీడియా లో లీక్ అయ్యి బాగా వైరల్ అయ్యింది. ఆయన బిగ్ బాస్ షో లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొంటున్నందుకు ఒక్కో వారానికి 5 లక్షల రూపాయిల వరకు రెమ్యూనరేషన్ ని అందుకుంటున్నాడు అట. ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో అందరికంటే ఎక్కువ రెమ్యూనరేషన్ ని అందుకుంటున్నది శివాజీనే.

- Advertisement -
Bigg Boss Telugu Shivaji

11 వారాల నుండి హౌస్ లో ఉన్నాడు కాబట్టి దాదాపుగా 55 లక్షల రూపాయిల వరకు శివాజీ రెమ్యూనరేషన్ ని అందుకున్నాడని సమాచారం. అంటే టైటిల్ విన్ అయ్యి, గెలుచుకునే ప్రైజ్ మనీ కంటే ఎక్కువ శివాజీ ఇప్పటికే సంపాదించేసాడు అన్న మాట. వారానికి 5 లక్షల రూపాయిలు అంటే రోజుకి 71 వేల రూపాయిలు అన్నమాట. శివాజీ ఈ రియాలిటీ షో అటు ఆర్థికంగా, ఇటు కెరీర్ పరంగా పెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here