Shivaji Raja : బిగ్ బాస్ హౌస్ ఎలా ఇన్ని రోజులు నామినేషన్స్,గ్రూప్ గేమ్స్,అసూయ తో కూడిన మాటలు ఇవే కనిపిస్తూ వచ్చింది ఈ సీజన్ మొత్తం. అయితే ఈ వారం లో నామినేషన్స్ పర్వం కాస్త హీట్ వాతావరణం లో జరిగినా,ఆ మరుసటి రోజు నుండి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి సంబంధించిన కుటుంబాలు ఒక్కొక్కరిగా రావడం, చాలా కాలం తర్వాత వారిని చూడడం తో కన్నీటి పర్యంతం అయిన కంటెస్టెంట్స్ ని చూసి ఆడియన్స్ కూడా బాగా ఎమోషనల్ అవ్వడం, ఇలాంటివి జరుగుతూ వస్తున్నాయి.

ఈ సీజన్ మొత్తం మీద ఇవే ది బెస్ట్ ఎపిసోడ్స్ అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. అందరి కంటే ముందుగా శివాజీ పెద్ద కొడుకు హౌస్ లోకి వచ్చాడు. ఇతను ఉన్నంత సేపు శివాజీ ముఖం మతాబు లాగ వెలిగిపోయింది. ఈరోజు ఆయన మాస్టర్స్ చదువు కోసం అమెరికా కి వెళ్లనున్నాడు.

బయటకి వచ్చిన తర్వాత నాన్న ని కలిసే ఛాన్స్ ఉండదు కాబట్టి శివాజీ భార్య బదులుగా పెద్ద కొడుకు శ్రీ వచ్చాడు. ఇతను అచ్చు గుద్దినట్టు శివాజీ పోలికలతో ఉండడం విశేషం. తన కొడుకు ఎవరితో పెద్దగా కలవడు, పెద్దగా మాట్లాడడు అని చెప్పుకుంటూ వచ్చేవాడు శివాజీ. కానీ నిన్న కంటెస్టెంట్స్ అందరితో కలుపుగోలు గా మాట్లాడడం ని చూసి శివాజీ సైతం ఆశ్చర్యానికి గురి అయ్యాడు.

అదంతా పక్కన పెడితే శివాజీ గత రెండు వారాల నుండి కంటెస్టెంట్స్ రెచ్చగొడితే రెచ్చిపోతున్నాడు. నామినేషన్స్ తనపై వేస్తుంటే తీసుకోలేకపోతున్నాడు. ఇది గమనించిన ఆయన కొడుకు శివాజీ కి వివరించే ప్రయత్నం చెయ్యగా ‘ నేను చూసుకుంటాను, జాగ్రత్తగా ఆడుతాను, ఇన్ని రోజులు నువ్వు చెప్తేనే గేమ్ ఆడానా?’ అంటూ సీరియస్ గా రియాక్ట్ అయ్యాడు. అప్పటి వరకు మంచి సంతోషం గా ఉండిన శివాజీ, ఒక్కసారిగా తన కొడుకుని ఇలా అనడం తో ఆడియన్స్ కూడా షాక్ కి గురి అయ్యారు.