Shivaji నిర్మాతగా ప్రశాంత్ – యావర్ భారీ బడ్జెట్ సినిమా..’స్పై’ జోరు మామూలుగా లేదుగా !

- Advertisement -

Shivaji : ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో స్పై బ్యాచ్ ని ప్రేక్షకులు ఏ రేంజ్ లో ఆదరించారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. బిగ్ బాస్ ప్రారంభం నుండి శివాజీ మరియు ప్రశాంత్ చాలా క్లోజ్ గా ఉంటూ వచ్చారు. కామన్ మ్యాన్ గా అడుగుపెట్టిన ప్రశాంత్ ని హౌస్ లో ఉన్నవాళ్ళంతా టార్గెట్ చేస్తే, ప్రశాంత్ కి అండగా నిలబడిన ఏకైక కంటెస్టెంట్ శివాజీ మాత్రమే. అలా మొదటి వారం నుండి వీళ్లిద్దరు కలిసి ఉన్నారు.

Shivaji
Shivaji

నాల్గవ వారం నుండి యావర్ కూడా వీళ్ళలో చేరాడు. అలా శివాజీ, ప్రశాంత్ మరియు టవర్ కలిసి ఉన్న బ్యాచ్ కాబట్టి అభిమానులు స్పై అని పిలవడం మొదలు పెట్టారు. అప్పటి నుండి ఈ గ్రూప్ కి అశేష ఆదరణ దక్కింది. ముగ్గురు కూడా టాప్ 5 లోకి అడుగుపెట్టారు. యావర్ టాప్ 4 స్థానం లో 15 లక్షల క్యాష్ ప్రైజ్ తీసుకొని వెళ్లగా, శివాజీ టాప్ 3 స్థానం లో నిలిచాడు.

Shivaji Palle Prashanth yawar

ఇక పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ గా గెలిచి బిగ్ బాస్ రియాలిటీ షో లో విజేత గా నిల్చిన మొట్టమొదటి కామన్ మ్యాన్ గా చరిత్ర తిరగరాసాడు. అయితే వీళ్ళ రిలేషన్ కేవలం బిగ్ బాస్ వరకే ఉంటుంది, బయటకి వచ్చిన తర్వాత ఎవరి దారి వారిదే అని అనుకున్నారు. కానీ వీళ్ళు బయటకి వచ్చిన తర్వాత కూడా అదే రేంజ్ రిలేషన్ ని మైంటైన్ చేస్తూ వస్తున్నారు.

- Advertisement -
shivaji yawar palle prashanth

రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో శివాజీ మాట్లాడుతూ. నేను నిర్మాతగా మారి నేను, యావర్ మరియు ప్రశాంత్ కలిసి ఒక సినిమాలో నటిస్తాము. సినిమా పేరు స్పై అంటూ చెప్పుకొచ్చాడు. సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో పాపులర్ అయిన ఈ స్పై పదం బాగా జనల నోర్లలో నానింది. మరి ఈ టీం బిగ్ బాస్ లో విజయం చూసినట్టుగానే సినిమాలో కూడా విజయం చూస్తుందా లేదా అనేది చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here