Shivaji : తాజాగా శివాజీ.. స్టార్ కమెడియన్ ఆలీ హోస్ట్ చేస్తున్న ఒక షోకు గెస్ట్ గా విచ్చేశాడు. ఇక ఆలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెలబ్రిటీ గెస్ట్ గా వస్తే.. వారు పుట్టిన దగ్గరనుంచి ఈరోజు వరకు వారి జీవితాల్లో జరిగిన సంఘటనల గురించి నిర్మొహమాటంగా అడిగేస్తాడు. ఈ ప్రోమోలో కూడా ఏవ్ అడిగి హైప్ తీసుకొచ్చాడు. శివాజీని కూడా ఆలీ వదలలేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి హీరోగా మారిన ప్రయాణం నుంచి రాజకీయాలు, బిగ్ బాస్, #90’s సిరీస్ వరకు అన్ని ప్రశ్నలను అడిగేశాడు. సినిమాలకు దూరంగా ఉన్న సమయంలో #90’s సిరీస్ ఆఫర్ ఎలా వచ్చింది అన్న ప్రశ్నకు శివాజీ మాట్లాడుతూ..

‘‘చాలా కాలం తరువాత బాపినీడు గారిని కలవాలని వెళ్లాను. ఆ సమయంలోనే బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. అదే విషయం చెప్పాను. అదేం పర్లేదు. దాన్ని వదలకు అని చెప్పారు. ఆ తరువాత #90’s సిరీస్ రిలీజ్ అయ్యింది. ఈ సిరీస్ కోసం దాదాపు 5 లక్షల మంది సబ్ స్క్రైబ్ అయ్యారు” అని చెప్పుకొచ్చాడు. ఇక నువ్వు ఎవరు గుర్తుపట్టకూడదని మీసాలు, గెడ్డం తీసేసి దుబాయ్ లో తిరిగావంట ఎందుకు ..? అన్న ప్రశ్నకు శివాజీ మాట్లాడుతూ.. ‘‘వేషం మార్చి దుబాయ్ లో పట్టుబడ్డ శివాజీ.. అసలు అప్పటికప్పుడే కోర్టులో అంతా జరిగిపోయింది.. ఇక్కడ వ్యాపారం చేయాలంటే రాజకీయం చేయాలనీ” చెప్పుకొచ్చాడు.

శివాజీ ఎందుకు దుబాయ్ లో పట్టుబడ్డాడు అన్న ప్రశ్న అసలు ఎందుకు వచ్చింది అంటే.. 2019 లోఅలందా మీడియా కేసులో శివాజీ పోలీసులకు పట్టుబడినట్లు వార్తలు వచ్చాయి. ఒక టీవీ ఛానెల్ వాటాల వ్యవహారంలో పోలీసు విచారణకు హాజరుకాకుండా అజ్ఞాతంలో ఉండటంతో ఆయనపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీచేయడంతో.. శివాజీ ఎవరి కంట పడకుండా ఉండడానికి గెడ్డం, మీసం తీసేసి దుబాయ్ వెళ్తున్న సమయంలో పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం. ఇక దీనిపై శివాజీ ఎన్నోసార్లు క్లారిటీ కూడా ఇచ్చాడు. తాను ఇప్పటి వరకు 50సార్లు అమెరికా వెళ్లాలని లీగల్‌గా వెళ్లినందునే తనను ఎవరూ అడ్డుకోలేదని చెప్పారు.